లింగ నిర్ధారణ చట్ట విరుద్ధం: సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-27T05:38:55+05:30 IST

లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని సబ్‌కలెక్టర్‌ జాహ్నవి స్పష్టం చేశారు. శుక్రవారం సబ్‌కలెక్టరేట్‌లో వైద్య, పోలీసు, ఐసీడీఎస్‌ సిబ్బందితో సమావేశమయ్యారు.

లింగ నిర్ధారణ చట్ట విరుద్ధం: సబ్‌ కలెక్టర్‌
సూచనలిస్తున్న సబ్‌కలెక్టర్‌ జాహ్నవి

మదనపల్లె టౌన్‌, నవంబరు 26: లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని సబ్‌కలెక్టర్‌ జాహ్నవి స్పష్టం చేశారు. శుక్రవారం సబ్‌కలెక్టరేట్‌లో వైద్య, పోలీసు, ఐసీడీఎస్‌  సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయ కుండా ప్రభుత్వం చట్టం తెచ్చిందన్నారు. ఈ చట్టా న్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మదన పల్లె డివిజన్‌లో స్కానింగ్‌ సెంటర్లను వైద్యశాఖ అధి కారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, వలం టీర్లను అప్రమత్తం చేసి స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతుంటే గుర్తించాలన్నారు. కర్ణాటక, తమిళనాడు అధికారులతో ఆంధ్ర వైద్యశాఖ అధికారులు స్కానింగ్‌ సెంటర్లలో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించాలన్నారు. విద్యాసంస్థల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. భేటీ బచావో..భేటీ పడావో పథకం అమలుకు ఐసీడీఎస్‌ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయా లన్నారు.  డిప్యూటీ డీఎంహెచ్‌వో లక్ష్మి, టూటౌన్‌ సీఐ నరసింహులు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రఫి, డీపీ ఆర్‌వో రమణ, డాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, మధుసూ దనాచారి, సీడీపీవో సుజాత పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T05:38:55+05:30 IST