లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

ABN , First Publish Date - 2022-05-18T04:46:45+05:30 IST

శిశువుని గర్భంలోనే లింగ నిర్ధారణ చేసి, అక్రమ అబార్శన్లు చేయడం చట్ట రీత్యా నేరమని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి పేర్కొన్నారు.

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
మాట్లాడుతున్న అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి

- అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి

నారాయణపేట టౌన్‌, మే 17 : శిశువుని గర్భంలోనే లింగ నిర్ధారణ  చేసి, అక్రమ అబార్శన్లు చేయడం చట్ట రీత్యా నేరమని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అప్రాప్రియేట్‌ అథారిటీ కమిటీ జిల్లాలో గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండం లింగ నిర్ధారణ నిషేద చట్టం అమలుపై సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ శిశువుని గర్భంలోనే లింగ నిర్ధారణ  చేసి అక్రమ అబార్శన్లు చేయడం నేరమని దీనికి గరిష్ఠంగా రూ.50వేల జరిమానా, పదేళ్లు జైలుశిక్ష విధిం చడానికి అవకాశం ఉందన్నారు. ఆడపి ల్ల, మగపిల్లలైన ఇద్దరు సమానమే అన్నారు. రెడియోలాజిస్ట్‌, సోనో లాజిస్ట్‌, గైనకాల జిస్ట్‌ మాత్రమే అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించాలని రిజిస్ర్టేషన్‌, అర్హతలు లేకుండా స్కానింగ్‌ నిర్వహించ రాదన్నారు. లేనిచో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజా రాణి, డీఎంహెచ్‌వో రాంమనోహర్‌రావు, ఇందిరమ్మ, ఎన్‌జీవో అమన్‌ వేదిక, శైలజ, హన్మంతు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T04:46:45+05:30 IST