షాకింగ్: కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా.. సెలైన్ వాటర్.. ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2021-08-12T06:26:33+05:30 IST

కొవిడ్ వ్యాక్సిన్ బదులుగా ఓ నర్సు.. సెలైన్ ద్రావణాన్ని ఇచ్చిన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు కొవిడ్ టీకా ప్రాముఖ్య

షాకింగ్: కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా.. సెలైన్ వాటర్.. ఎక్కడంటే..!

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ బదులుగా ఓ నర్సు.. సెలైన్ ద్రావణాన్ని ఇచ్చిన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు కొవిడ్ టీకా ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్ జోన్‌లో ఉండొచ్చని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు.. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియలను చేపడుతున్నాయి. జర్మనీ ప్రభుత్వం కూడా తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తోంది. కాగా.. జర్మనీలోని ఫ్రైస్‌ల్యాండ్‌లో ఓ నర్సు.. మార్చి-ఏప్రిల్ మధ్యలో వ్యాక్సిన్ బదులుగా దాదాపు 8,600 మందికి సెలైన్ ద్రావణాన్ని ఇచ్చినట్టు తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో స్థానిక కౌన్సిలర్ స్వెన్ అంబ్రోసీ సోషల్ మీడియా వేదికగాకీలక ప్రకటన చేశారు. విషయం తెలిసిన వెంటనే షాక్‌కు గురైనట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా.. టీకా స్థానంలో సెలైన్ ద్రావణాన్ని పొందిన 8,600 మందికి టీకా డోసులను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కాగా.. టీకా బదులుగా ప్రజలకు సెలైన్ ద్రావణాన్ని ఇచ్చిన నర్సు‌కు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. 


Updated Date - 2021-08-12T06:26:33+05:30 IST