Advertisement

అసాధ్యమనుకున్న దాన్ని సాధించిన శాస్త్రవేత్తలు.. నడవడం కుదరదనుకుంటే..

Jan 24 2021 @ 20:58PM

ఇంటర్నెడెస్క్: వెన్నుముకలోని గాయం కారణంగా నడవలేని స్థితికి చేరుకున్న ఓ ఎలకను జర్మనీ శాస్త్రవేత్తలు మళ్లీ నడిచేలా చేయగలిగారు. దెబ్బతిన్న నాడులు తిరిగి పెరిగేలా చేసి.. నాడి వ్యవస్థను ఉత్తేజితం అయ్యేలా చేయడంతో ఎలుక మళ్లీ నడవగలిగేలా చేశారు. కాగా.. ఈ చికిత్స మనుషులకు కూడా భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా మారుతుందని వారు చెబుతున్నారు. రూర్ యూనివర్శిటీ నిపుణులు ఈ ఫీట్ సాధించారు. ఓ కొత్త ప్రోటీన్‌ను వినియోగించి వారు..దెబ్బతిన్న నాడీ వ్యవస్థ తిరిగి కోలుకునేలా చేయగలిగారు. రోడ్డు ప్రమాదాల్లో మనుషులకు కూడా ఇటువంటి గాయాలవుతుంటాయి. వెన్నుపూసలోని నాడులు దెబ్బతినడంతో కదల్లేక బాధితులు మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే.. ఈ చికిత్సను మనుషులకు కూడా ఉపయోగపడేలా తీర్చి దిద్దగలిగితే ఎంతో మంది బాధితులు తమ మునుపటి జీవితాన్ని పొందగలుగుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.