German Shepherd కుక్కపై ఎక్సైజ్, ప్రొబిషన్ చట్టం ఉల్లంఘన కేసు...అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-07-18T17:21:31+05:30 IST

సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌ రాష్ట్రంలోని బక్సర్‌లో ఎక్సైజ్ చట్టం కింద జర్మన్ షెపర్డ్‌ కుక్కను పోలీసులు...

German Shepherd కుక్కపై ఎక్సైజ్, ప్రొబిషన్ చట్టం ఉల్లంఘన కేసు...అదుపులోకి తీసుకున్న పోలీసులు

పాట్నా(బీహార్): సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌(bihar) రాష్ట్రంలోని బక్సర్‌లో ఎక్సైజ్ చట్టం కింద జర్మన్ షెపర్డ్‌ కుక్కను (German Shepherd dog) పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సంచలనం రేపింది. బక్సర్ జిల్లా ముఫాసిల్ పట్టణంలో బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జర్మన్ షెపర్డ్ ఆడ కుక్కను అదుపులోకి పోలీసు అధికారులు తీసుకున్నారు.జులై 6వతేదీన ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌ నుంచి బీహార్ రాష్ట్రానికి వస్తున్న కారును పోలీసులు తనిఖీ చేయగా కారులో ఆరు ఐఎంఎఫ్‌ఎల్ బాటిళ్లు(మద్యం) కనిపించాయి.మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఎక్సైజ్ చట్టాల ప్రకారం వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.


 బీహార్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టంలోని సెక్షన్ 57 కింద వాహనాన్ని కూడా జప్తు చేశారు.మద్యం బాటిళ్లను తీసుకువస్తున్న వారితోపాటు వాహనంలో దొరికిన జర్మన్ షెపర్డ్ కుక్కను కూడా పోలీసులు సెక్షన్ 56(2) కింద అదుపులోకి తీసుకున్నారు.ఈ కుక్కను ప్రస్తుతం ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మేలు జాతి జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచడం చాలా ఖరీదైన వ్యవహారమని పోలీసు ఇన్‌స్పెక్టర్ చెప్పారు.ఈ కుక్క ఆంగ్లంలో సూచనలను మాత్రమే అర్థం చేసుకుంటుందని, దీంతో పోలీసులు ఆంగ్లం తెలిసిన యువకుల సహాయం తీసుకోవలసి వచ్చింది.


Updated Date - 2022-07-18T17:21:31+05:30 IST