అమెరికా నుంచి జర్మనీకి యాంటీబాడీ కాక్‌టైల్‌ డోస్‌లు.. ఒక్కో డోస్ ధర ఎంతంటే..

ABN , First Publish Date - 2021-01-25T17:35:01+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఇచ్చిన యాంటీబాడీ కాక్‌టైల్‌ డోస్‌లను జర్మనీ కొనుగోలు చేసినట్టు జర్మనీ ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది.

అమెరికా నుంచి జర్మనీకి యాంటీబాడీ కాక్‌టైల్‌ డోస్‌లు.. ఒక్కో డోస్ ధర ఎంతంటే..

బెర్లిన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఇచ్చిన యాంటీబాడీ కాక్‌టైల్‌ డోస్‌లను జర్మనీ కొనుగోలు చేసినట్టు జర్మనీ ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ట్రంప్ కరోనా మహమ్మారి బారిన పడిన సమయంలో మిలిటరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయనకు యాంటీబాడీ కాక్‌టైల్ డోస్‌ను ఇచ్చారు. ఈ డోస్ కరోనాపై బాగా పనిచేస్తుందని నమ్ముతున్న జర్మనీ ప్రభుత్వం ఒక్కో డోస్‌కు రూ. 1.7 లక్షలు చెల్లించి మొత్తం 2 లక్షల డోస్‌లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. తమ ప్రభుత్వం 400 మిలియన్ యూరోల(దాదాపు రూ. 3,555 కోట్లు)తో రెండు లక్షల డోస్‌లను కొనుగోలు చేసిందని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్ తెలిపారు. జర్మనీలోని యూనివర్శిటీ ఆస్పత్రుల్లో ఈ వారం యాంటీబాడీ కాక్‌టైల్ డోస్‌లను వాడనున్నట్టు ఆయన చెప్పారు. కాగా.. జర్మనీలో ఇప్పటివరకు మొత్తం 21,47,740 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి ఇప్పటివరకు 52,777 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2021-01-25T17:35:01+05:30 IST