Corona effect: జర్మనీ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు రద్దు

ABN , First Publish Date - 2021-11-12T12:55:34+05:30 IST

ఈ వారం ప్రారంభంలో 40 వేల కేసులు.. గురువారం ఏకంగా 50 వేలపైనే.. మరోవైపు వ్యాక్సినేషన్‌ మందగమనం..! జర్మనీలో ప్రస్తుతం పరిస్థితిది. టీకా పంపిణీ ఇదే విధంగా కొనసాగితే రానున్న నెలల్లో లక్షమంది ప్రాణాలు...

Corona effect: జర్మనీ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు రద్దు

  • పూర్తిగా కరోనా రోగులకే సేవలు..
  • ఒక్క రోజే 50 వేలపైగా కేసులు


బెర్లిన్‌, నవంబరు 11: ఈ వారం ప్రారంభంలో 40 వేల కేసులు.. గురువారం ఏకంగా 50 వేలపైనే.. మరోవైపు వ్యాక్సినేషన్‌ మందగమనం..! జర్మనీలో ప్రస్తుతం పరిస్థితిది. టీకా పంపిణీ ఇదే విధంగా కొనసాగితే రానున్న నెలల్లో లక్షమంది ప్రాణాలు కోల్పోతారని ఆరోగ్య నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. సర్కారు ఆంక్షల విధింపునకు సిద్ధమవుతోంది. కొన్ని రీజియన్ల ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిగా కరోనా బాధితులకే సేవలు అందించనున్నారు.


కాగా, ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్‌కు అతిథ్యం ఇవ్వనున్న చైనా.. ఒక్క కరోనా కేసు వచ్చినా ఉలిక్కిపడుతోంది. బీజింగ్‌ సెంట్రల్‌లోని చావోయంగ్‌, హైడియన్‌ జిల్లాల్లో గురువారం ఆరు కేసులు వచ్చాయి. పాజిటివ్‌ సన్నిహిత కాంటాక్టు ఒకరు రాజధానిలోని షాపింగ్‌ మాల్‌ను సందర్శించినట్లు తెలియడంతో, వినియోగదారులు, సిబ్బంది ఉండగానే మాల్‌ను సీజ్‌ చేసి, ప్రతి ఒక్కరినీ పరీక్షించిన తర్వాతే పంపారు.

Updated Date - 2021-11-12T12:55:34+05:30 IST