ఏటా 4 లక్షల మంది విదేశీయులకు ఆహ్వానం.. జర్మనీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-22T03:41:27+05:30 IST

నానాటికీ తగ్గిపోతున్న యువజనాభా.. పెరిగిపోతున్న కార్మికుల కొరత కారణంగా జర్మనీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో విదేశీయులను దేశంలోని ఆహ్వానించేందుకు నిర్ణయించింది.

ఏటా 4 లక్షల మంది విదేశీయులకు ఆహ్వానం.. జర్మనీ కీలక  నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్: నానాటికీ తగ్గిపోతున్న యువజనాభా.. పెరిగిపోతున్న కార్మికుల కొరత కారణంగా జర్మనీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో విదేశీయులను దేశంలోని ఆహ్వానించేందుకు నిర్ణయించింది. వృత్తిగత నైపుణ్యాలున్న నాలుగు లక్షల మంది విదేశీయులను ఏటా జర్మనీలోకి ఆహ్వానించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ‘‘కార్మికుల కొరత కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోంది’’ అని జర్మనీ రాజకీయ నాయుకులు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. ఈ ఏడు జర్మనీలో కార్మికుల సంఖ్య 3 లక్షల మేర తగ్గిపోతుందని సమాచారం. అయితే.. జర్మనీ మాత్రమే కాకుండా.. ఐరోపా ఖండంలోని పలు దేశాలు ఇలాంటి జనాభాపరమైన సమస్య ఎదుర్కొంటున్నాయి. యువజంటలు పిల్లల్ని కనాలంటూ పోప్ ఇటీవలే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-22T03:41:27+05:30 IST