మెరుగైన వైద్యసేవలందించండి

ABN , First Publish Date - 2021-04-21T05:04:14+05:30 IST

కొవిడ్‌ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కొవిడ్‌ పర్యవేక్షణాధికారి క్రాంతి లాల్‌ దండే అన్నారు. మంగళ వారం స్థానిక జిల్లా ఆసుపత్రిని సందర్శించి కొవిడ్‌ రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

మెరుగైన వైద్యసేవలందించండి
నరసన్నపేట: పట్టణంలో అవగాహన కలిగిస్తున్న ఎంపీడీవో రవికుమార్‌

జిల్లా కొవిడ్‌ పర్యవేక్షణాధికారి క్రాంతిలాల్‌ దండే

 టెక్కలి రూరల్‌, ఏప్రిల్‌ 20: కొవిడ్‌ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కొవిడ్‌ పర్యవేక్షణాధికారి క్రాంతి లాల్‌ దండే అన్నారు. మంగళ వారం స్థానిక జిల్లా ఆసుపత్రిని సందర్శించి కొవిడ్‌ రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆక్సిజన్‌ తదితర అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచా లన్నారు. ఆయనతో పాటు సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే, డిప్యూటీ డీఎం హెచ్‌వో డా.లీల, ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ డా.కణితి కేశవరావు తదితరులున్నారు. 


దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరి

నందిగాం: దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌, తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు అన్నారు. మంగళవారం నందిగాం మార్కెట్‌ ఆవరణలో దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా రెండోదశ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి దుకాణాదారు నిబంధనలు అమలు చేయాలన్నారు. కొనుగోలుదారులు మాస్క్‌ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యదర్శి పి.ఆనందరావు, వీఆర్వో వెంక టేశ్వరరావు ఉన్నారు.

నాలుగు కరోనా కేసులు...

 మండలంలోని రెండు గ్రామాల్లో మంగళవారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, లక్ష్మీ శ్రీదేవి  పర్యవేక్షణలో క్లోరినేషన్‌ చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించారు. నంది గాం పీహెచ్‌సీలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు టీకా వేశారు. వైద్యాధికారి కె.అనిత కుమారి పర్యవేక్షించయారు. సీహెచ్‌వో దాతారాం, హెచ్‌ఎస్‌ సూర్య నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


మండలంలో ముగ్గురికి...

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని ఓ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యాధికారి రెడ్డి హేమలత మంగళవారం తెలిపారు. ఇటీవల గ్రామంలో కొవిడ్‌ పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. కరోనా వ్యాధి వున్న ట్లు గుర్తించిన అన్ని గ్రామాల్లో  వైద్యపరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. పాజిటివ్‌ బాధి తులను క్వారంటైన్‌ కేంద్రాలకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతిరోజూ చేపడుతున్న ఫీవర్‌ సర్వేలో గుర్తించిన బాధితు లకు తప్పనిసరిగా మెరుగైన వైద్య సేవలందించాలని ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాద రావు తెలిపారు. వలంటీర్లు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతిరోజూ ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలన్నారు.  


పీహెచ్‌సీ పరిధిలో 10 మందికి..

సంతబొమ్మాళి: మండలంలో బోరుభద్ర పీహెచ్‌సీ పరిధిలోని ఒక గ్రామంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా మంగళవారం నిర్ధారణ అయిం దని వైద్యాధికారి డా.గోపీకృష్ణ తెలిపారు. పీహెచ్‌సీలో ప్రతిరోజూ కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసోలైషన్‌లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా సంతబొమ్మాళిలో పీహెచ్‌సీ సిబ్బంది ఆధ్వర్యంలో కొవిడ్‌ పరీక్షలు చేశారు. గ్రామంలో సర్పంచ్‌ కళింగపట్నం ఆశ పర్యవేక్షణలో పారిశుధ్య పనులు చేపట్టారు. 


నెలలో 151...

నరనసన్నపేట: పట్టణంలో కరోనా విజృంభిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో జీవీ రవికుమార్‌  సూచిం చారు. మంగళవారం పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రజలను అవగాహన కలిగించారు. ఈనెలలో ఇప్పటి వరకు 151 కేసులు నమోదు కాగా.. ఒక్క పట్టణంలో 99 కేసులు నమోదయ్యాయన్నారు. ఓ గ్రామంలోని పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకిందన్నారు. 

 

పాతపట్నంలో తొమ్మిది..

పాతపట్నం: మండలంలో మంగళవారం తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని  తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ తెలిపారు. స్థాని కంగా ఒక కాలనీలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనందున కంటోన్మెంట్‌ జోన్‌గా ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఏఎంసీలో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యావపారులతో మాట్లాడుతూ.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వ్యాపారాలు చేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో సీఐ ఆర్‌.రవిప్రసాద్‌ , ఎంపీడీవో  జయంత్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


రేగిడిలో 41... 

రేగిడి: రేగిడి, బూరాడ పీహెచ్‌సీల పరిధిలోని వివిధ గ్రామాల్లో 41 మందికి పాజిటివ్‌  నిర్ధారణ అయిందని వైద్యాధికారులు సీతారాం, పార్థసారధి మంగళవారం తెలిపారు.  వీరిలో ఒకరు ప్రాణాపాయంతో శ్రీకాకుళం రిమ్స్‌లో, మరో ఇద్దరు ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు, మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. 


 పనితీరు మెరుగుపరచుకోండి

రాజాం/రూరల్‌: వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని, లేకుంటే  కఠినచర్యలు తప్పవని పాలకొండ ఆర్డీఓ కుమార్‌ హెచ్చరించారు. కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. స్థానిక సామాజిక ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రాజాం పరిసర గ్రామాల్లో కరోనా విజృంభిస్తుండంతో  కరోనా వైద్య పరీక్షలు ముమ్మరం చేసినట్లు  కొవిడ్‌ వైద్యుడు ఆకిరి భార్గవ్‌ తెలిపారు. రాజాం పట్ట ణంలో బుధవారం నుంచి వ్యాపారాలు  మధ్యాహ్నం మూడు గంటల వరకే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కంబాల జోగులు, అధికారులు పేర్కొన్నారు. ఆర్డీవో కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, సి.ఐ. పి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ వేణుగోపాలరావు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-04-21T05:04:14+05:30 IST