పోటాపోటీగా కుక్కల పరుగు పెందెం

ABN , First Publish Date - 2021-03-06T04:40:30+05:30 IST

అయిజ పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కుక్కల పరుగు పందేలు ఆసక్తికరంగా సాగాయి.

పోటాపోటీగా కుక్కల పరుగు పెందెం
కుక్కల పరుగు

అయిజ, మార్చి 5 : అయిజ పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కుక్కల పరుగు పందేలు ఆసక్తికరంగా సాగాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. తెలంగాణపాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 24 కుక్కలు పోటీలో పాల్గొన్నాయి. మొదటి బహుమతి కర్ణాటక రాష్ట్రం రాయిచూరు జిల్లా కండ్లూరుకు చెందిన కుక్క గౌరీష్‌కు చెందిన రేంజర్‌ కైవసం చేసుకున్నది. రాయిచూర్‌ జిల్లా హజ్‌కల్‌ గ్రామానికి చెందిన తిమ్మప్పనాయక్‌కు చెందిన రాణి రెండో బహుమతి గెలుచుకుంది. మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన మహేష్‌ కుక్క రాఖీ మూడో బహుమతి దక్కించుకుంది. రాయిచూర్‌ జిల్లా గౌరీష్‌కు చెందిన రీటా నాలుగో స్థానంలో నిలిచింది. వీటి యజమానులకు నిర్వాహకులు మల్లికార్జున్‌రెడ్డి, వాగుగడ్డ విష్ణు, అశోక్‌, బహుమతులు అందించారు. అలాగే తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకలకు చెందిన పందుల పోటీలు కూడా జరిగాయి.



Updated Date - 2021-03-06T04:40:30+05:30 IST