నాడు-నేడు పనులు సకాలంలో పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-11-28T04:54:02+05:30 IST

మండలంలోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న నాడు - నేడు పనులను త్వరగా పూర్తి చేయాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌ ఆదే శించారు.

నాడు-నేడు పనులు సకాలంలో పూర్తి చేయండి
నాడు - నేడు పనులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌

గుమ్మలక్ష్మీపురం : మండలంలోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న నాడు - నేడు  పనులను త్వరగా పూర్తి చేయాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌ ఆదే శించారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో విలేఖర్లతో  మాట్లాడారు. కొన్ని పాఠశాలల్లో  నాడు - నేడు పనులు సక్రమంగా జరగడం లేదన్నారు.  సకా లంలో పూర్తిచేయకపోతే సిబ్బందిపై చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఆయా సిబ్బందికి పలు సూచనలను చేశామన్నారు.  వలంటీర్ల ద్వారా ఆయా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 50 నుంచి 60 శాతం ఉందని, దీనిని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.  పార్వతీపురం డివిజన్‌లో పేదలకు సుమారు 25 వేల వరకు ఇళ్ల పట్టాలను ఇప్పించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠ శాల, కొత్తగూడ, కేడీ కాలనీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో  నాడు-నేడు పనులను పరిశీలించారు.  స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు, కం ప్యూటర్లను పరిశీలించారు.తహసీల్దార్‌ పి.రాములమ్మ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  బొబ్బిలి:  పట్టణ పరిధి  పొట్టి శ్రీరాములు మునిసిపల్‌ పాఠశాలలో  చేపడుతున్న నాడు-నేడు పనులను కమిషనర్‌ ఎంఎం నాయుడు పరిశీలించారు. మరుగుదొడ్లు, తరగతి గదులు, కొళాయిలు తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనంతరం 16వ నెంబరు సచివాలయాన్ని తనిఖీ చేశారు. 

 

 


Updated Date - 2020-11-28T04:54:02+05:30 IST