Dubai super sale: ప్రవాసులకు గుడ్‌న్యూస్.. ఆ మూడు రోజుల్లో అన్ని రకాల వస్తువులపై ఏకంగా 90 శాతం డిస్కౌంట్..!

ABN , First Publish Date - 2022-05-27T17:01:14+05:30 IST

దుబాయ్‌లో ఉండే ప్రవాసులకు గుడ్‌న్యూస్. Dubai Super Sale డేట్స్ వచ్చేశాయి. తాజాగా దుబాయ్ ఫెస్టివల్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిషమెంట్ (DFRE) దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించింది.

Dubai super sale: ప్రవాసులకు గుడ్‌న్యూస్.. ఆ మూడు రోజుల్లో అన్ని రకాల వస్తువులపై ఏకంగా 90 శాతం డిస్కౌంట్..!

దుబాయ్: దుబాయ్‌లో ఉండే ప్రవాసులకు గుడ్‌న్యూస్. Dubai Super Sale డేట్స్ వచ్చేశాయి. తాజాగా దుబాయ్ ఫెస్టివల్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిషమెంట్ (DFRE) దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించింది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు Dubai Super Sale కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఇవాళ్టి(శుక్రవారం) నుంచి ప్రారంభమవుతున్న ఈ ద్వై-వార్షిక ఈవెంట్‌లో షాపింగ్ చేసేవారికి 90 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. లైఫ్‌స్టైల్, బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఇతర కేటగిరీలకు చెందిన వస్తువుల కొనుగోళ్లపై కస్టమర్లకు ఏకంగా 90 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దుబాయ్ వ్యాప్తంగా సుమారు 1,500 రిటైల్ స్టోర్స్, ఔట్‌లెట్స్‌ Dubai Super Saleలో పాల్గొంటున్నాయి. దాదాపు 500 బ్రాండ్స్‌కు చెందిన వస్తువులు అందుబాటులో ఉండనున్నాయి. 


ఇక ఈ సేల్‌ అందుబాటులో ఉండే షాపింగ్ మాల్స్, స్టోర్స్ వివరాలను పరిశీలిస్తే.. మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, దీరా సిటీ సెంటర్, మిర్డిఫ్ సిటీ సెంటర్, సిటీ సెంటర్ అల్ షిందాఘా, సిటీ సెంటర్ మెయిసెమ్, మై సిటీ సెంటర్ AL బర్షా, దుబాయ్ మాల్, దుబాయ్ మెరీనా మాల్, దుబాయ్ హిల్స్ మాల్, మెర్కాటో, టౌన్ సెంటర్ జుమేరా, ఇబ్న్ బటుటా, డ్రాగన్ మార్ట్ 1 & 2, సర్కిల్ మాల్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, ఫెస్టివల్ ప్లాజా, ది పాయింట్, నఖీల్ మాల్, DIFC వద్ద ఉన్న గేట్ అవెన్యూ.      


Updated Date - 2022-05-27T17:01:14+05:30 IST