జీజీహెచ్‌లో అదనంగా 80 పడకలు

ABN , First Publish Date - 2021-05-07T06:50:45+05:30 IST

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అదనంగా 80 పడకలు ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆసుపత్రి పరిపాలనా అధికారులు తెలిపారు.

జీజీహెచ్‌లో అదనంగా 80 పడకలు

జీజీహెచ్‌ (కాకినాడ), మే 6: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అదనంగా 80 పడకలు ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆసుపత్రి పరిపాలనా అధికారులు తెలిపారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి రీత్యా ఆసుపత్రిలో ఆక్సిజన్‌, నాన్‌ ఆక్సిజన్‌ బెడ్‌లకు డిమాండ్‌ ఉండడంతో కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న అధికార యంత్రాంగం అదనంగా బెడ్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుందన్నారు. ఈ 80 బెడ్‌లలో 34 బెడ్‌లకు ఆక్సిజన్‌ సిలెండర్లు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే 17 ఆక్సిజన్‌ సిలిండర్లు ఖాళీ కాగానే, వెంటనే ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ చేసి రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తామన్నారు. 9 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి వచ్చాయని, 5 కొవిడ్‌ క్యాజువాలిటీ విభాగం, మిగిలినవి ఎస్‌ఎస్‌ఆర్‌ వార్డులో ఏర్పాటు చేస్తామన్నారు.




Updated Date - 2021-05-07T06:50:45+05:30 IST