పారమ్మ కొండ వద్ద గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు
పాచిపెంట, ఫిబ్రవరి 28 : మండలంలోని చెరుకుపల్లి సమీపంలో పారమ్మతల్లి కొండ వద్ద ఆది వారం భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు దక్షిణ దిశగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మధ్యాహ్నంతో పూర్తయింది. సుమారు ఆరు కిలో మీటర్లు గిరి ప్రదక్షిణ చేశారు. శివనామస్మరణ, అమ్మవారి భజ నలు, భక్తి పాటలు పాడుతూ పూర్తి చేశారు. అనంతరం దిగువనున్న అమ్మవారి పాదాలకు నమస్కరించి పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించారు.