ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్

Published: Sun, 26 Jun 2022 21:45:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్

వివరాలకు వెళ్ళేముందు దయచేసి ఈ లంకె ను నొక్కి సంతకాల సేకరణకు మీ మద్దతు తెలియ చేయండి:

https://www.change.org/BharatRatnaforGhantasala 


అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమనే నినాదంతో శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 120 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 2022 జూన్ 19న జరిగిన అంతర్జాల(Zఊం) కార్యక్రమములో హాంకాంగ్ నుంచి జయ పీసపాటి (వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య) వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  


నంది పురస్కార గ్రహిత, గీత రచయిత, ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డుల విజేత చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమరగాయకుడు, ప్రముఖ సంగీతదర్శకులు, స్వాతంత్రసమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకోసం 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలిసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం కృషి చేయడం అభినందనీయం అని తెలిపారు. ఘంటసాల గురుంచి మాట్లాడం తన అదృష్టంగా భావిస్తున్నాని చెపుతూ వారి జీవితం గురుంచిన వివరాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. గాయకుడిగా ఎన్నో అత్యద్భుత గీతాలను ఇప్పటికి ఎన్నటికీ తెలుగువాడి పాట ఖ్యాతిని నలుచెరుగులా రెపరెపలాడించారు. ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లేని రోజుల్లో అన్ని గీతాలను అత్యద్భుతంగా పాడటం వారికే చెల్లిందని తెలియచేసారు. సంగీత దర్శకుడిగా వందకుపైగా ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం భారతదేశ సినీ పరిశ్రమ మొత్తంలో వారికే చెల్లిందని, దేశభక్తి ప్రభోదించే గీతాలను ఆలపించడం, కుంతి విలాపం, పుష్ప విలాపము, బంగారుమామ జానపద గేయాలు,  జాషువా గారి బాబాయ్ పాటలు, మనుషులకు జీవన ప్రమాణాలను ప్రభోదించే భగవత్గీతను అందించడం... బాల్యంలో కడు పేదరికాన్ని అనుభవంచి వారాలు గడిపి సంగీతం నేర్చుకొని  సినీ పరిశ్రమలో ఎవరు అందుకోని మైలు రాళ్ళను చేరుకోగలిగారని తెలియచేసారు. తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు పదానికి పర్యాయ పదంగా మారారంటూ... క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని కోరుతూ, ఈ దిశగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.


మరో ముఖ్య అతిధి, గాయకుడు, సంగీత దర్శకుడు, ఈటీవీ మొట్టమొదటి రియాలిటీషో విజేత, పాడుతా తీయగా గాయకుడు పార్థ నేమాని ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని చెబుతూ.. వారు మనల్ని విడిచి ఇన్ని సంవత్సరాలైనా మన మనసుల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కారం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాలను మించిన భారతరత్న ఏముంటుంది అని చెబుతూ వారు నిజంగా భారతరత్న'మే అని ప్రశంసించారు. తనకు బాగా పేరొచ్చిన పాడుతా తీయగా పాటను పాడి ప్రేక్షకులను అలరింప చేశారు.  


చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల ఈ మీటింగ్‌లో అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూన్నామన్నారు. అందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతు ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 దేశాల సేవలను కొనియాడారు. 


యు.యెస్.ఏ నుండి డా. రాఘవ రెడ్డి గోసాల, ఉత్తర అమెరికాతెలుగు సంఘం నాటా మాజీ అధ్యక్షుడు గంగసాని రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడాలి చక్రధరరావు తాన ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2003/05, వ్యవస్థాపక అధ్యక్షుడు టెన్నిస్సీ తెలుగు సమితి 1995/97, డాక్టర్ జయసింహ సుంకు, ఛైర్మన్, NRI వాసవి, ఐర్లాండ్ నుండి రాధా కొండ్రగంటి అధ్యక్షురాలు, ఐర్లాండ్ తెలుగుఅసోసియేషన్, జపాన్ నుండి శాస్త్రి పాతూరి, వాలంటీర్, జపాన్ తెలుగు సమాఖ్య, భారతదేశం నుండి కోలపల్లి హరీష్ నాయుడు, బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొని మాట్లాడుతూ,  ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని అభిప్రాయపడ్డారు. ఘంటసాలకు కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అందరూ ముక్తకంఠంతో కోరారు. ఈ దిశగా విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.  


ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని పలు తెలుగు సంస్థలతో 123 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (శిగ్నతురె ఛంపైగ్న్) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులకు బాల ఇందుర్తి ధన్యవాదాలు తెలియ చేసారు. ఈ లింక్ ద్వారా సంతకాల సేకరణలో పాల్గొని మద్దతు తెలపాలన్నారు. https://www.change.org/BharatRatnaForGhantasalaGaru 


ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.