ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ కళాకారుల శతగళార్చన

ABN , First Publish Date - 2022-08-31T03:28:54+05:30 IST

ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ కళాకారుల శతగళార్చన

ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ కళాకారుల శతగళార్చన

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు(Ghantasala) శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో 165 పైగా టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ పరంపరలో భాగంగా జరిగిన తాజా కార్యక్రమంలో.. ముఖ్యఅతిథిలుగా ప్రముఖ దర్శకులు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 10 మంది సహ నిర్వాహకులు అయిన విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులుతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా.. మొదటి భాగాన్ని 21 ఆగస్టు నాడు ప్రసారం చేయగా దానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని నిర్వాహుకులు తెలియజేశారు. 28 ఆగష్టు నాడు రెండవ భాగం ప్రసారం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు..  మిగతా రెండు భాగాలు 4 సెప్టెంబర్, మరియు 11 సెప్టెంబర్ లో ప్రసారం అవుతుందని చెప్పారు. 


రెండవ భాగంలో పాల్గొన్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఘంటసాల గొప్ప గాయకులూ అని ప్రశంసించారు.  గొప్ప సంగీత దర్శకుడిగా అంతే గొప్ప విజయం సాధించారని అన్నారు.  తనకు తెలిసినంత వరకు ఈ సినీ జగత్తులో ఇటువంటి అర్హత వారొక్కరే సాధించారు అని తెలిపారు. ‘‘మా నాన్నగారు ఎప్పుడు ఘంటసాల గురించి చెబుతూ ఉంటారని, వారి పాడిన పాటలు వారి జీవితాలలో ఎటువంటి ప్రేరణ కలిగించాయో అని, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఘంటసాల పాటలు నుంచి ప్రేరణ పొందారు’’ అని చెప్పారు. తరతరాలుగా గుర్తుండి పోయే వ్యక్తి ఘంటసాల అని కొనియాడారు. ఘంటసాల పాడిన భగవద్గీత అందరి హృదయాలలో ఎప్పటికి నిలిచిపోతుందన్నారు.  ఒక మనిషి జననం నుండి మరణం వరకు సంగీతపరంగా ఒక జీవితం మొత్తం ఆక్రమించుకునేది ఒక్క భగవద్గీత అని తెలిపారు. అంత గొప్ప భగవద్గీతను ఆలపించే అవకాశం రావడం అంటే ఘంటసాల నిజంగా కారణజన్ములని వ్యాఖ్యానించారు. ఘంటసాల పాడిన భగవద్గీతని వినడం అందరి అదృష్టమని అన్నారు.  అంతటి మహానుభావుడు ఘంటసాల గురించి మాట్లాడే అవకాశం లభించడం నిజంగా తన అదృష్టమని తెలిపారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా వారికి భారత రత్న ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు.


ఈ కార్యక్రమంలో సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరుతో పాటు వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వంశీ రామరాజు, తెలంగాణ కల్చరల్ సొసైటీ నుండి నీలం మహేందర్, సుబ్బు వి పాలకుర్తి, తోట సహదేవుడు, వేణు మల్లవరపు, రామాంజనేయులు చామిరాజు, అనంత్ బొమ్మకంటి, రవి విశ్వాత్ముల, గుంటూరు వెంకటేష్, ప్రమీల గోపు, శ్రీని జాలిగామ, నీలిమ గడ్డమణుగు బృందం నుంచి శ్రీకాంత్ లంక, హిరణ్య ఆత్రేయపురపు, సుబ్బు ఆత్రేయపురపు, శ్రవణ్ మట్ల పూడి, శాంతకుమారి మేడిచర్ల, సాయి శిరీష లంక, విజు కాకతీయ చిలువేరు, మైత్రి సంస్థ వ్యవస్థాపకులు, అట్లాంటా, USA బృందం నుంచి శారదా సాయి (హైదరాబాద్), రాఘవ బాబు తడవర్తి, గాయత్రి తంగిరాల, ఫణి వంశీ ముడుంబ. రామ్ దుర్వాసుల (అట్లాంటా, USA) బృందం నుండి దర్భా భాస్కర్, కృష్ణమాచారి కారంచేడు, మోహన్ దేవ్, రాధికా నోరి, స్రవంతి కోవెల, శ్రీయాన్  కోవెల, దుర్గ గోరా పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి ఆ అమరగాయకుడిని స్మరించుకున్నారు. అంతేకాకుండా..  ఇండోనేషియా నుండి తెలుగు అసోసియేషన్ అఫ్ ఇండోనేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు టీవీయస్ ప్రవీణ్, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించర్ల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి ghantasala100th@gmail.com వివరాలు పంపాలని కోరారు. సిగ్నేచర్ క్యాంపెయిన్ కోసం https://www.change.org/BharatRatnaForGhantasalaGaru లింక్‌పై క్లిక్ చేయండి. 

Updated Date - 2022-08-31T03:28:54+05:30 IST