ఘర్‌ సంసార్‌ యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్‌

ABN , First Publish Date - 2021-10-27T06:07:39+05:30 IST

గవర్నర్‌పేట రాజగోపాలచారి వీధిలో ఈనెల 24న రాత్రి ఘర్‌ సంసార్‌ షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగి పెంపుడు జంతువులు, పక్షులు మృతిచెందడంపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

ఘర్‌ సంసార్‌ యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 26 : గవర్నర్‌పేట రాజగోపాలచారి వీధిలో ఈనెల 24న రాత్రి ఘర్‌ సంసార్‌ షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగి పెంపుడు జంతువులు, పక్షులు మృతిచెందడంపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. గుంటూరు రెడ్డి పాలానికి చెందిన హెల్ప్‌ఫర్‌ యానిమల్స్‌ సొసైటీ కార్యదర్శి అనుపోజు తేజవంత్‌ మంగళవారం చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 429 అండర్‌ సెక్షన్‌ 11(1), (ఎ), 11(1) (ఇ), 11(1) (డి), 38, 38(1) జంతుహింస నిరోధక చట్టం మేరకు ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసి సీఐ నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్‌ సంసార్‌ యజమాన్యం పెంపుడు జంతువులు, పక్షులు విక్రయిస్తారని, కానీ వాటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. పైగా వాటిని విక్రయానికి యానిమల్‌ ప్రివెన్షన్‌ బోర్డు అనుమతులు, అగ్నినిరోధక ఏర్పాట్లు లేవన్నారు. పక్షులు, జంతువుల మృతదేహాలకు పశుసంవర్ధకశాఖ వైద్యుడిచే పోస్టుమార్టం చేయించాలని ఫిర్యాదులో కోరారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి కేవలం 21ఏళ్ల యువకుడు కావడం విశేషం. 

Updated Date - 2021-10-27T06:07:39+05:30 IST