ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం

ABN , First Publish Date - 2021-09-19T04:11:01+05:30 IST

ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉద్యోగాల ఆశతో లక్షల రూపాయలను ముట్టజెప్పిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యో గాలు రాకపోగా ఐపీ నోటీసులు పంపడంతో మోసపోయామని తెలుసుకున్న యువకులు పోలీసులను ఆశ్రయించారు. భీమిని మండలం బిట్టూర్‌పల్లికి చెందిన పోతురాజుల సురేష్‌ రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని తాండూర్‌ మండలం తంగళ్లప ల్లికి చెందిన ఎర్రబోతు వినోద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
బాధితులు

తాండూర్‌, సెప్టెంబరు 18: ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉద్యోగాల ఆశతో  లక్షల రూపాయలను ముట్టజెప్పిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యో గాలు రాకపోగా ఐపీ నోటీసులు పంపడంతో మోసపోయామని తెలుసుకున్న యువకులు పోలీసులను ఆశ్రయించారు. భీమిని మండలం బిట్టూర్‌పల్లికి చెందిన పోతురాజుల సురేష్‌ రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని  రూ.2.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని తాండూర్‌ మండలం తంగళ్లప ల్లికి చెందిన ఎర్రబోతు వినోద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇతని ఫిర్యాదు తర్వాత ఒక్కొక్కరుగా 11 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీరి నుంచి సుమారుగా రూ.30లక్షలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.  

రెండేళ్లుగా  ఎదురుచూపులు

బిట్టూర్‌పల్లికి చెందిన సురేష్‌ తనకు పలువురితో పరిచయాలున్నాయని, ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించాడు. ఎన్టీపీసీతోపాటు రైల్వే, పోస్టల్‌, స్టీల్‌ప్లాంట్‌ లో ఉద్యోగాలు అంటూ ఒక్కొక్కరి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పటి వర కు తాండూర్‌ నుంచి ఇద్దరు, బెల్లంపల్లి, కన్నెపల్లి, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్‌, దేవాపూర్‌ నుంచి ఒక్కొక్కరు, కాగజ్‌నగర్‌ మండలానికి చెందిన నలుగురు ఇతని ఉచ్చులో పడ్డట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరు రూ.2లక్షలకు పైగానే ముట్ట జెప్పారు. తాండూర్‌ మండలానికి చెందిన ఓ యువకుడు అతనికి, అతని భార్యకు ఉద్యోగం కోసం రూ.15 లక్షలు చెల్లించాడు. రెండేళ్ల నుంచి ఈ తతంగం కొనసాగుతుండగా ఇప్పుడు మోసపోయామని గుర్తించారు. ఉద్యో గం, డబ్బుల గురించి ఎవరైనా ఫోన్‌ చేస్తే ఏవేవో కారణాలు చెబుతూ,  బెది రిస్తూ దాటవేశాడని బాధితులు వాపోయారు. ఫోన్‌లో రికార్డింగ్‌కు దొరక కుండా ఎప్పుడు వాట్సప్‌లోనే మాట్లాడేవాడని బాధితులు పేర్కొన్నారు. బాధి తుల్లో కొందరు వాట్సప్‌ మాటలను మరో ఫోన్‌తో రికార్డు చేశారు. చివరకు బాధితుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కోర్టులో ఐపీకి దరఖాస్తు చేసుకు ని 11 మందికి నోటీసులు పంపాడని  తెలిపారు.  బాధితులు సురేష్‌ ఇంటికి వెళితే తమకు సంబంధం లేదంటూ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని బాధితులు పేర్కొన్నారు.

ఉద్యోగ నియామక పత్రాలని చెప్పి

బెల్లంపల్లికి చెందిన డోలి ప్రశాంత్‌ అనే యువకుడికి ఉద్యోగ నియామక పత్రం వస్తుందని చెప్పగా స్పీడ్‌ పోస్టులో వచ్చిన కవర్‌ను తీసుకునే ముందు ఎంతో ఆశతో ఓపెన్‌ చేశాడు. అది కోర్టు నుంచి వచ్చిన నోటీసుగా గుర్తించా నని, తనతోపాటు తన కుటుంబ సభ్యులు ఎంతో ఆశతో చూసి కన్నీరు పెట్టు కున్నారని ప్రశాంత్‌ తలిపాడు. మరో యువకుడికి ఉద్యోగంలో డ్రెస్‌ కోడ్‌ చెప్పి దుస్తులు కూడా కొనిపించాడని తెలిపారు. ఉద్యోగాలఆశతో మోసపోయామని, తమకు డబ్బులిప్పించేలా చూడాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 

కేసు నమోదు చేశాం: కిరణ్‌ కుమార్‌, ఎస్సై

 ఈ విషయంపై తాండూర్‌ ఎస్సై కిరణ్‌ కుమార్‌ను సంప్రదించగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ చేపడుతున్నామన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు.  

Updated Date - 2021-09-19T04:11:01+05:30 IST