ltrScrptTheme3

అశ్లీల వీడియోలతో womans బ్లాక్ మెయిలింగ్..మారువేషంలో విటుల్లా వచ్చి ఆట కట్టించిన పోలీసులు

Oct 23 2021 @ 07:53AM

సెక్స్‌టార్షన్ రాకెట్‌ గుట్టురట్టు

ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్):ఘజియాబాద్ నగరంలో కొందరు మహిళలు కొత్త రకం మోసానికి తెరలేపారు. కొందరు మహిళలు అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన నయా రాకెట్ బాగోతాన్ని ఘజియాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్ట్రిప్ చాట్ ద్వారా యువకులను బ్లాక్ మెయిల్ చేసిన సెక్స్ టార్షన్ రాకెట్ సభ్యులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.ఘజియాబాద్ నగరంలో కొందరు మహిళలు  న్యూడ్ వీడియో క్లిప్ ల ద్వారా యువకులను బ్లాక్ మెయిల్ చేశారని ఘజియాబాద్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ చెప్పారు. ఘజియాబాద్ నగరంలో ఓ మహిళ తన భాగస్వామితో కలిసి సెక్స్ టూరిజం రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులే మారువేషంలో విటులుగా వ్యవహరించి నిందితురాలిని అరెస్టు చేశారు. 

ఇద్దరు అమ్మాయిలను గోవా పర్యటనకు పంపించారు. విమానాశ్రయంలో విటుల్లాగా మారువేషంలో వచ్చిన పోలీసులు ముగ్గురు మహిళలను పట్టుకున్నారు. సీఐఎస్‌ఎఫ్‌, ఎయిర్‌పోర్టు పోలీసుల సాయంతో ప్రధాన నిందితురాలిని పట్టుకున్నారు. విచారణ కోసం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మహిళ తన నేరాన్ని అంగీకరించింది. దీంతో నిందితురాలిని ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతించడంతో కోర్టు ముందు ప్రవేశపెట్టారు.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.