383 రోజుల తర్వాత ఘాజీపూర్ సరిహద్దు నుంచి స్వగ్రామానికి Rakesh Tikait

ABN , First Publish Date - 2021-12-15T17:21:31+05:30 IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో 383 రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టిన రాకేష్ తికాయత్ బుధవారం ఘాజీపూర్ సరిహద్దు నుంచి నిష్ర్కమించారు....

383 రోజుల తర్వాత ఘాజీపూర్ సరిహద్దు నుంచి స్వగ్రామానికి Rakesh Tikait

రైతుల ఉద్యమాన్ని నిలిపివేశాం కానీ ఉపసంహరించుకోలేదంటూ వ్యాఖ్యలు

ఘాజీపూర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో 383 రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టిన రాకేష్ తికాయత్ బుధవారం ఘాజీపూర్ సరిహద్దు నుంచి నిష్ర్కమించారు. ఘాజీపూర్ నుంచి తన స్వస్థలమైన సిసౌలీకి వచ్చిన రాకేష్ తికాయత్ కు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలకనున్నారు. రైతుల ఆందోళలనతో దిగివచ్చిన కేంద్రం మూడు చట్టాలను పార్లమెంటులో ఉపసంహరించుకుంది.రాకేష్ తికాయత్ బుధవారం మోడీనగర్, మీరట్, దౌరాలా టోల్ ప్లాజా, మన్సూర్‌పూర్ మీదుగా యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సిసౌలికి చేరుకుంటారు.


తికాయత్ రాక సందర్భంగా సిసౌలీ ప్రజలు కిసాన్ భవన్ ను రంగురంగుల దీపాలతో అలంకరించి లడ్డూలు సిద్ధం చేశారు. రైతుల ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశామే కాని పూర్తిగా ఉపసంహరించుకోలేదని రాకేష్ తికాయత్ చెప్పారు.రైతులు నిరసన విరమించడంతో సింగు సరిహద్దు నుంచి కాంక్రీట్ అడ్డంకుకులను తొలగించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Updated Date - 2021-12-15T17:21:31+05:30 IST