నెయ్యి... నేస్తమే!

ABN , First Publish Date - 2022-06-27T05:45:56+05:30 IST

నెయ్యితో కొవ్వు పెరిగిపోతుందనీ, ఆది ఆరోగ్యానికి హానికరమనే భావన చాలా మందిలో నాటుకుపోయింది.

నెయ్యి... నేస్తమే!

నెయ్యితో కొవ్వు పెరిగిపోతుందనీ, ఆది ఆరోగ్యానికి హానికరమనే భావన చాలా మందిలో నాటుకుపోయింది. కానీ మేధోశక్తినీ, జ్ఞాపకశక్తినీ పెంచడంలో, జీర్ణవ్యవస్థను చక్కదిద్దడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ వైరల్‌గా పనిచేసే బుటిరిక్‌ యాసిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇందులో ఎక్కువే! వీటితో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటంటే...

బీటా కెరోటిన్లకు, ఎ, డి, కె విటమిన్లకు  నెయ్యి ఒక నిధి లాంటిది. మిగతా వంటనూనెల్లో కంటే, నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది.

నెయ్యిలోని జీవశక్తినీ, వ్యాధినిరోధకశక్తినీ పెంచే అంశాలు, ఆయుష్షు వృద్ధికి తోడ్పడంతో పాటు, వార్థక్య లక్షణాలను నియంత్రించి యవ్వనాన్ని నిలబెడతాయి. శరీరంలోని మలినాలను బయటికు పంపే శక్తి కూడా నెయ్యిలో ఉంది. 

నెయ్యి పిల్లల ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు ఏకాగ్రతను, జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. 

నెయ్యిలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియలను ఉత్తేజపరచడంతోపాటు, కొలెస్ట్రాల్‌నూ, శరీర బరువునూ తగ్గిస్తాయి. 

నెయ్యి కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గ్లకోమా సమస్యను తగ్గిస్తుంది. నిత్యం నెయ్యి సేవిస్తే నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది. 

Updated Date - 2022-06-27T05:45:56+05:30 IST