పరగడుపున నెయ్యి ఆరోగ్యానికి మంచిదా?

ABN , First Publish Date - 2022-03-03T05:30:00+05:30 IST

ప్రతిరోజూ పరగడుపున ఒక చెంచా నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు. ఎలా అంటే...

పరగడుపున నెయ్యి ఆరోగ్యానికి మంచిదా?

ప్రతిరోజూ పరగడుపున ఒక చెంచా నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు. ఎలా అంటే...

పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల చిన్న పేగులకు సంగ్రహించే శక్తి పెరుగుతుంది. పేగుల్లోని పీహెచ్‌ లెవెల్స్‌ తగ్గుముఖం పడతాయి. జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. 

నెయ్యి జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముఖంపై ముడతలు దూరమవుతాయి.

ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధం. 

ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. నెయ్యిలో ఉండే బ్యుటిరిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఎ, డి, ఇ, కె.... రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కీళ్లలో రాపిడి తగ్గుతుంది. శరీరకణాలలో ఫ్రీ రాడికల్స్‌ పేరుకుపోవడం తగ్గుతుంది. రక్తనాళాలు గట్టిపడటాన్ని నిరోధిస్తుంది.

Read more