నెయ్యి మంచిదే!

Sep 22 2021 @ 00:00AM
>
  • ఒక  గ్లాసు పాలల్లో ఒక చెంచా నెయ్యి, కొద్దిగా పసుపు, మిరియాలు వేసి తాగితే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది.
  • నెయ్యి జీవక్రియల రేటు మెరుగుపరిచేలా చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
  • ఇందులో బ్యుట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్‌ ఫుడ్‌గా పనిచేసి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
  • నెయ్యిలో విటమిన్‌ - కె2 సమృద్ధిగా లభిస్తుంది. ఎముకలు క్యాల్షియంను గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గేందుకు ఉపకరిస్తుంది.
  • 5 గ్రాముల నెయ్యిలో 44.8 క్యాలరీలు, 4.9 గ్రా ఫ్యాట్‌ ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, మినరల్స్‌, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
  • డయాబెటిస్‌, ఒబేసిటి, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు డాక్టర్‌ సలహా మేరకు నెయ్యిని తీసుకోవాలి. 
  • Follow Us on:
    Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
    Designed & Developed by AndhraJyothy.