
హైదరాబాద్: ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు బల్దియా తెలిపింది. ఐసొలేషన్ కేంద్రాలను గుర్తించాలని అధికారులకు బల్దియా ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో సర్కిల్‌కి ఒక్కో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఒమైక్రాన్ కేసులు పెరిగితే సెంటర్లు పెంచేలా సన్నాహాలు చేస్తోంది. గతేడాది ఉపయోగించిన ఐసొలేషన్ కేంద్రాలకు శానిటేషన్ చేస్తున్నారు.