భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC

ABN , First Publish Date - 2022-07-09T20:10:51+05:30 IST

భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్‌ఎఫ్‌ (DRF) అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జీహెచ్‌ఎంసీ

భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC

హైదరాబాద్: భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్‌ఎఫ్‌ (DRF) అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. గ్రేటర్‌లో వర్షం నీరు నిలిచే 211 ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్షం నీటిని తొలగించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. SNDP పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. హెల్ప్‌లైన్ నెం. 04 2111 1111ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. నగరవాసులు మ్యాన్‌ హోల్స్ తెరవవద్దని జలమండలి హెచ్చరించింది. మ్యాన్‌హోల్స్‌ మూతలు విరిగినా, తెరచి ఉన్నా.. సమాచారం ఇవ్వాలన్న హైదరాబాద్‌ వాటర్‌బోర్డ్ సూచించింది. 


భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ(GHMC) హై అలర్ట్(High Alert) ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాన శుక్రవారం ఉదయం నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా విస్తరించింది. శనివారం కూడా వర్షం భారీగా కురుస్తుంది. శనివారం ముంపు ప్రాంతాల్లో నగర మేయర్ విజయ లక్ష్మి పర్యటించారు. ఈ నేపథ్యంలో రసూల్ పురా నాలాపనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరో మూడు, నాలుగు రోజులపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - 2022-07-09T20:10:51+05:30 IST