జీహెచ్ఎంసీ ఎన్నికల స్పెషల్.. చికెన్‌ బిర్యానీ రూ.150

ABN , First Publish Date - 2020-11-21T19:41:15+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.5 లక్షలు. ప్రచార సమయంలో అంతకు మించి ఖర్చు చేసినట్లు తేలితే అభ్యర్థిపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల స్పెషల్.. చికెన్‌ బిర్యానీ రూ.150

మటన్‌ బిర్యానీ  160

చాయ్‌ రూ.5, కాఫీ రూ.10 

ఎన్నికల ప్రచారంలో ప్రతిదానికీ లెక్క

గీత దాటితే అభ్యర్థిపై వేటు తప్పదు

ఖర్చుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.5 లక్షలు. ప్రచార సమయంలో అంతకు మించి ఖర్చు చేసినట్లు తేలితే అభ్యర్థిపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రచార సమయంలో ఎంత ఖర్చు పెడుతున్నారన్నది కీలకం కానుంది. తాగే నీటి నుంచి రోడ్‌ షోల్లో వినియోగించే సౌండ్‌ బాక్స్‌ల వరకు ప్రతి దానికో లెక్క ఉండాలి. ఎన్నికల వేళ ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారన్నది గుర్తించేందుకు డివిజన్ల వారీగా పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశారు. ప్రచారంలో పాల్గొనే వారికి వాటర్‌ పాకెట్‌ ఇచ్చినా, చాయ్‌ తాగించినా ఎన్నికల ఖర్చు కిందకే వస్తుంది.


ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరల ప్రకారం ప్రచార ఖర్చును నిర్ణయిస్తారు. 2016 ఎన్నికల సమయంలో చాయ్‌ రూ.10, కాఫీ రూ.12 ఉండగా... ఇప్పుడు వాటి ధరలను వరుసగా రూ.5, రూ.10గా నిర్ణయించారు. కిందటి సారి చికెన్‌ బిర్యానీ రూ.140 ఉండగా.. ఇప్పుడు రూ.150, వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌ ధరను రూ.65 నుంచి రూ.80కి పెంచారు. మటన్‌ బిర్యానీ రూ.170 నుంచి రూ.160కి తగ్గించారు. ప్రచారంలో బ్యానర్లు, జెండాలు, వేసే వేదికలు.. టెంట్లు ఇలా.. ప్రతి దానికి ఓ ధరను నిర్ణయించారు.


ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరలు ఇవి.. 


టీ, కాఫీ రూ.5, 10

వాటర్‌ ప్యాకెట్‌ రూ.1

వాటర్‌ బాటిల్‌ 200 ఎం.ఎల్‌ రూ.5

వాటర్‌ బాటిల్‌ 500 ఎంఎల్‌ రూ.10

వాటర్‌ బాటిల్‌ 1 లీటరు రూ.20

పులిహోర 300 గ్రాములు రూ.35

ఆలు సమోస రూ.10

వెజ్‌ బిర్యానీ 750 గ్రాములు రూ.100

చికెన్‌ బిర్యానీ 750 గ్రాములు రూ.150

ఎగ్‌ బిరియానీ 750 గ్రాములు రూ.120

మటన్‌ బిరియానీ 750 గ్రాములు రూ.160

వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌ రూ.80 

ఇడ్లీ ప్లేటు (4) రూ.20

వడ ప్లేటు (4)  రూ.20

వెజ్‌ మీల్స్‌ రూ.70


జెండాలు, వేదికలు...

గుడ్డ జెండాలు 

చిన్న సైజు రూ.30

పెద్ద సైజు రూ.61

ప్లాస్టిక్‌ జెండాలు (100) రూ.30

స్టార్‌ ఫ్లెక్సీలు చదరపు అడుగు రూ.20

లైట్‌తో కూడిన స్టార్‌ ఫ్లెక్సీలు చదరపు అడుగు రూ.30


కటౌట్లు (చెక్కవి) 8 ఫీట్లు- రూ.1700

10 ఫీట్లు-రూ.2200


కుర్చీలు (ఒక్కోటి) రోజుకి రూ.7

గ్రీన్‌ మ్యాట్‌    చదరపు అడుగు రూ.2

టెంట్‌ పరిమాణం 1836 రోజుకి రూ.1100

టెంట్‌ పరిమాణం 1224 రోజుకి రూ.990

టెంట్‌ పరిమాణం 918 రోజుకి రూ.660

కార్ల అద్దె  రూ.1200 నుంచి రూ.1700

Updated Date - 2020-11-21T19:41:15+05:30 IST