Ghulam Nabi Azad: గులాంనబీ ఆజాద్ జమ్మూకశ్మీరుకు కాబోయే సీఎం...కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-27T17:57:59+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్(Ghulam Nabi Azad) రాజకీయ భవితవ్యం గురించి ఆయన సన్నిహిత అనుచరుడు....

Ghulam Nabi Azad: గులాంనబీ ఆజాద్ జమ్మూకశ్మీరుకు కాబోయే సీఎం...కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్(Ghulam Nabi Azad) రాజకీయ భవితవ్యం గురించి ఆయన సన్నిహిత అనుచరుడు, జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) మాజీ ఎమ్మెల్యే(former Congress MLA), యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమీన్ భట్( Amin Bhatt) శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాంనబీ ఆజాద్(Veteran politician Ghulam Nabi Azad) కాంగ్రెస్(Congress) పార్టీకి రాజీనామా చేసిన ఒకరోజు తర్వాత అమీన్ భట్ శనివారం ఆయన్ను కలిసి చర్చించారు. జమ్మూకశ్మీరుకు కాబోయే ముఖ్యమంత్రి గులాంనబీ అని( will be the JK CM)అమీన్ భట్ చెప్పారు.జమ్మూకశ్మీరులో గులాంనబీ ఆజాద్ త్వరలో సొంత పార్టీ పెడతారని భట్ వెల్లడించారు. 


గులాంనబీ నేతృత్వంలోని కొత్త పార్టీ బీజేపీకి బీ టీం కాదని అమీన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ 5 పేజీల లేఖ రాసిన విషయం పాఠకులకు విదితమే.తాను బీజేపీలో చేరబోనని ప్రకటించిన ఆజాద్ త్వరలో జమ్మూకశ్మీరులో సొంత పార్టీని ఏర్పాటు చేస్తానన్నారు.జమ్మూకశ్మీరుకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆజాద్ సన్నిహిత అనుచరుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


Updated Date - 2022-08-27T17:57:59+05:30 IST