35 కేజీల మాస్కు... కరోనా పోవాలంటూ ప్రార్థనలు!

Jun 16 2021 @ 22:58PM

ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బకు ప్రపంచమంతా అల్లాడిపోతోంది. దీని కట్టడి కోసం ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుపోతుంటే ప్రజలు తమ భయాలను తొలగించుకునేందుకు ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. ఇక జపాన్‌లోని ఫుకుషిమా ప్రిఫెక్చర్‌ ప్రాంతపు ప్రజలు కూడా దైవారాధనపైనే తమ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వారు అక్కడి బౌధ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కానాన్ దేవత విగ్రహానికి మాస్కు తొడిగి..కరోనా పీడ వదిలిపోవాలని కోరుతూ ఆ దేవతను ప్రార్ధించారు. అయితే..ఈ దేవత విగ్రహం ఏకంగా 57 మీటర్ల ఎత్తు ఉండటంతో వారు 35 కేజల మాస్కు సిద్ధం చేయాల్సి వచ్చింది. నలుగురు సిబ్బంది మూడు గంటల పాటు కష్టపడి తాళ్ల సహాయంతో మాస్కును 55 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి తొడిగారు. కాగా..ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన దేశంలో కూడా కొందరు కరోనాని దేవతాగా పూజిస్తూ ప్రార్థలు చేసిన ఘటనలు ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...