కొత్త కోడలికి అత్తింటివారి మర్యాద మామూలుగా లేదుగా!

Jun 16 2021 @ 11:25AM

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన ఘట్టం. ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని చాలా మంది కలలుకంటుంటారు. అయితే ఆర్థిక ప్రభావం దృష్ట్యా మామూలుగానే పెళ్లి తంతును ముగించేస్తుంటారు. ఈ కరోనా పరిస్థితుల్లో అయితే మరీ సింపుల్‌గా పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఇక ఆ తర్వాత అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తింటికి పంపించే కార్యక్రమాన్ని కూడా సింపుల్‌గా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కొత్త కోడలికి అత్తింటి మర్యాద మామూలుగా లేదుగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో మీరూ చేసేయండి మరి!Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...