వ్యభిచార పురుషుడిగా పనిచేయాలనే దురాశతో లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2022-01-18T09:31:40+05:30 IST

అతని తండ్రి ఒక పోలీస్. కానీ అతనికి జిగోలో(పురుష వ్యభిచారి)గా పని చేయాలని ఆశ. దీంతో అతడు ఒక మేల్ ఎస్కార్ట్ కమ్ కాల్ బాయ్‌ కంపెనీ వారిని సంప్రదించాడు. వారు ఇచ్చిన లేడీ క్లైంట్స్‌ నెంబరుతో సదరు యువకుడు భారీగా మోసపోయాడు...

వ్యభిచార పురుషుడిగా పనిచేయాలనే దురాశతో లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. అదెలాగంటే..

అతని తండ్రి ఒక పోలీస్. కానీ అతనికి జిగోలో(పురుష వ్యభిచారి)గా పని చేయాలని ఆశ. దీంతో అతడు ఒక మేల్ ఎస్కార్ట్ కమ్ కాల్ బాయ్‌ కంపెనీ వారిని సంప్రదించాడు. వారు ఇచ్చిన లేడీ క్లైంట్స్‌ నెంబరుతో సదరు యువకుడు భారీగా మోసపోయాడు. ఏకంగా రూ.1.53 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన రాహుల్(23, పేరు మార్చబడినది)అనే  యువకుడు ఒక జిగోలోగా పనిచేసి మహిళలతో రాసలీలలు చేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం సోషల్ మీడియోలో కాల్ బాయ్ ఉద్యోగం అంటూ ఒక ప్రకటన చూసి సదరు కంపెనీకి ఫోన్ చేశాడు. ఆ కంపెనీ వారు అతడికి జిగోలో వృత్తి గురించి, నిమయాల గురించి చెప్పారు. జిగోలోగా పనిచేయాలంటే మహిళా క్లైంట్ల(కస్టమర్లు)ను సంతృప్తి పరచాలి. తద్వారా వచ్చే సంపాదనలో 80 శాతం కాల్ బాయ్‌కి మిగగా 20 శాతం కంపెనీకి అని చెప్పారు. అందుకు రాహుల్ అంగీకరించాడు. ఆ ఎస్కార్ట్ కంపెనీ వారు రాహుల్ వ్యాట్సాప్ నెంబర్‌కు కాల్ బాయ్ అని ఐడీ కూడా పంపించారు. 


రెండు రోజుల తరువాత  రాహుల్‌కు అదే కంపెనీ వారు ఫోన్ చేసి ఒక మహిళా క్లైంట్ నెంబర్ ఇచ్చారు. ఆమెకు ఫోన్ చేసి అమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లమని చెప్పారు. దీంతో రాహుల్ ఆ మహిళ నెంబర్‌కు కాల్ చేసి విషయం వివరించాడు. ఆ మహిళ ఒక ఫైవ్ స్టార్ హోటల్ అడ్రస్‌కు రమ్మని చెప్పింది. రాహుల్ ఉత్సాహంతో అక్కడికి వెళ్లాడు. కానీ ఆమె అక్కడికి రాలేదు. దీంతో రాహుల్ ఆ మహిళకు మళ్లీ కాల్ చేశాడు. ఈ సారి ఆ మహిళ తాను ఆ హోటల్‌కి రావాలంటే హోటల్ రూం రెంట్, ట్యాక్సీ ఖర్చుల కోసం  రూ.32 వేలు కావాలని.. అవి తన బ్యాంకు అకౌంట్లో వేయమని చెప్పింది. పని పూర్తికాగానే రాహుల్ ఆ డబ్బులు తిరిగి ఫీజుతో సహా చెల్లిస్తానని చెప్పింది. ఆమె మాటలను నమ్మి రాహుల్ రూ.32,000 ఆమె బ్యాంకు అకౌంట్లో వేశాడు. అయినా ఆమె ఆ హోటల్‌కి రాలేదు. పైగా ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది.


ఏం చేయాలో తోచక రాహుల్ ఆ కంపెనీ వారికే ఫోనే చేశాడు. వాళ్లు ఆ మహిళ రావడం లేదని, డీల్ కాన్సిల్ అయిందని చెప్పారు. మరో రోజు ఇలాగే రాహుల్ మళ్లీ ఫోన్ వచ్చింది. ఈ సారి క్లైంట్ ఫారిన్ మహిళ అని చెప్పి రాహుల్ వద్ద నుంచి రూ.1.21 లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత ఆ కాల్ బాయ్ కంపెనీ వారు కూడా ఫోన్ తీయడంలేదు. ఈ సారి రాహుల్‌కు అనుమానం వచ్చింది. తనను ఎవరో మోసం చేశారని అర్థం చేసుకున్న రాహుల్ తన తండ్రికి చెప్పేశాడు. రాహుల్ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన సైబర్ విభాగానికి ఫిర్యాదు చేయడం వల్ల కేసు త్వరగా విచారణకు వచ్చింది.


పోలీసులు రాహుల్ డబ్బులు జమచేసిన బ్యాంకు అకౌంట్ వివరాలను బట్టి  ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతని రోహిత్ కుమార్. అతనే కాల్ బాయ్ కంపెనీ నడుపుతున్నాడు. పోలీసులు రోహిత్‌ని విచరాణ చేయగా.. అతను మరో స్త్రీ ద్వారా జిగోలో కావాలనే యువకులను ట్రాప్ చేసి డబ్బులు కాజేసేవాడు.


ప్రస్తుతం పోలీసులు రోహిత్ కుమార్‌పై చీటింగ్ కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపారు. నిందితురాలైన మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-01-18T09:31:40+05:30 IST