అల్లంతో ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-03-29T06:37:45+05:30 IST
అల్లంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి...
- వెక్కిళ్లు ఆగకుండా వస్తుంటే చిన్న అల్లం ముక్కను తింటే ఫలితం ఉంటుంది.
- అల్లంముక్క, తేనె కలిపిన మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- అల్లంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
- జీర్ణక్రియ జరిగే సమయంలో క్యాలరీలు బాగా కరిగేలా చేస్తుంది.
- వ్యాయామాలు చేయడం వల్ల తలెత్తే నొప్పుల నుంచి అల్లం శరీరానికి సాంత్వననిస్తుంది.
- అల్లం టీ దగ్గు, జలుబు, గొంతునొప్పులను తగ్గిస్తుంది. ఇంకా ఉదయాన్నే పైత్యం, వికారంతో ఇబ్బందిపడే వాళ్లకు అల్లం టీ మంచిది. అల్లం టీ తాగితే గుండెకు కూడా మంచిది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
- బహిష్ఠు వచ్చే నాలుగు రోజుల ముందు నుంచి అల్లం టీ తాగితే పొత్తి కడుపునొప్పిలాంటి సమస్యలు తలెత్తవు. అలర్జీలను కూడా అల్లం తగ్గిస్తుంది. అల్లం టీ మౌత్ఫ్రెష్నర్గా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.