వంటలు

అల్లం పచ్చడి

అల్లం పచ్చడి

ఇమ్యూనిటీ పచ్చళ్ళు

ఈ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రకరకాల కూరగాయల్లోనే కాదు, పప్పు దినుసులతోనూ, వాటితో చేసే పచ్చళ్లతోనూ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. పప్పుల పొడి, కూర పొడి, కరివేపాకు పచ్చడి, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఆ కోవకు చెందినవే. ఇంకెందుకాలస్యం.. ఈ వారం మీరూ ట్రై చేయండి.


కావలసినవి: అల్లం - పావుకేజీ, ఆవాలు - ఒక టీస్పూన్‌, మెంతులు - పది గింజలు, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, బెల్లం - కొద్దిగా, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, చింతపండు - నిమ్మకాయంత,  ఎండుమిర్చి - ఎనిమిది, జీలకర్ర - కొద్దిగా, ఉప్పు - తగినంత, పసుపు - కొద్దిగా, ఇంగువ - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగించాలి.అల్లం శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చసుకోవాలి. చింతపండును నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు పోపు, అల్లం ముక్కలు, బెల్లం, పసుపు, ఉప్పు, నానబెట్టిన చింతపండు... అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ.

అల్లం పచ్చడి

వంద గ్రాముల అల్లంలో...

క్యాలరీలు - 335

ఫ్యాట్‌ - 4.2 గ్రా

సాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 2.6గ్రా

సోడియం - 27 ఎంజి

కార్బోహైడ్రేట్లు - 72 గ్రా

డైటరీ ఫైబర్‌ - 14 గ్రా

ప్రొటీన్‌ - 9 గ్రా


ఇంకా క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి.అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అల్లం జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తిని అందిస్తుంది.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.