ప్రియుడితో కలిసి అన్నయ్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన యువతి.. చివరకు ఆమె ఎంతకు తెగించిందంటే..

ABN , First Publish Date - 2022-02-14T20:32:08+05:30 IST

ఆమె కొన్ని రోజులుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది.. గత శనివారం తన జన్మదినోత్సవం కావడంతో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది..

ప్రియుడితో కలిసి అన్నయ్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన యువతి.. చివరకు ఆమె ఎంతకు తెగించిందంటే..

ఆమె కొన్ని రోజులుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది.. గత శనివారం తన జన్మదినోత్సవం కావడంతో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది.. అతడి బైక్‌పై తిరిగింది.. ఆ సమయంలో అన్నయ్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.. అన్నయ్య అందరికీ చెబుతాడనే భయంతో ప్రియుడి చేత దాడి చేయించింది.. ఆ దాడిలో ఆమె అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు.. దీంతో ఆమె ప్రియుడితో కలిసి కటకటాల పాలైంది.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


బిలాస్‌పూర్‌లోని వైర్‌లెస్ కాలనీకి చెందిన రేఖ అనే యువతి కొన్ని నెలల క్రితం ఆశిష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆశిష్‌ను తరచుగా కలుసుకునేది. శనివారం రేఖ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా రేఖకు ఆశిష్ పార్టీ ఇచ్చాడు. తిరిగి బైక్ మీద ఇంటికి వెళ్లే సమయంలో రేఖను ఆమె సోదరుడు దీపక్ చూసేశాడు. అప్పటికే రేఖ, ఆశిష్ మద్యం మత్తులో ఉన్నారు. మరోవైపు దీపక్ కూడా మద్యం మత్తులోనే ఉన్నాడు. 


రేఖను వేరే యువకుడితో చూసిన దీపక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రేఖ, ఆశిష్‌పై దాడికి తెగబడ్డాడు. విషయం ఇంట్లో వారికి చెబుతానని బెదిరించాడు. మద్యం మత్తులో ఉన్న ఆశిష్, రేఖ కూడా దీపక్‌ను కొట్టారు. పక్కనే ఉన్న రాడ్డు తీసుకుని దీపక్ తలపై ఆశిష్ కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో దీపక్‌ను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల తర్వాత దీపక్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు రేఖ, ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-02-14T20:32:08+05:30 IST