ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. విద్యార్థిని కిడ్నాప్.. దుండగుల చెర నుంచి ఆమె ఎలా తప్పించుకుందంటే?..

ABN , First Publish Date - 2021-12-31T11:21:15+05:30 IST

కంప్యూటర్ కోర్సు చదువుకునే ఒక 16 ఏళ్ల విద్యార్థిని క్లాసుల కోసం ఇంటి నుంచి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లాక.. ఒక నెంబర్ ప్లేట్ లేని తెల్లటి కారు ఆమెను వెంబడిస్తూ వచ్చింది. కారు తననే వెంబడిస్తోందని అనుమానంతో ఆ అమ్మాయి..

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. విద్యార్థిని కిడ్నాప్.. దుండగుల చెర నుంచి ఆమె ఎలా తప్పించుకుందంటే?..

కంప్యూటర్ కోర్సు చదువుకునే ఒక 16 ఏళ్ల విద్యార్థిని క్లాసుల కోసం ఇంటి నుంచి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లాక.. ఒక నెంబర్ ప్లేట్ లేని తెల్లటి కారు ఆమెను వెంబడిస్తూ వచ్చింది. కారు తననే వెంబడిస్తోందని అనుమానంతో ఆ అమ్మాయి.. ధైర్యంగా కారు వైపుకు వెళ్లింది. కానీ అనుకోకుండా అందులో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి ఒక్కసారిగా ఆ అమ్మాయిని కారులోకి తోసి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే..


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో నివసించే ప్రియాంక(16, పేరు మార్చబడినది) కంప్యూటర్ క్లాసుల కోసం ఇంటి నుంచి బయలుదేరింది. దారి మధ్యలో ఆమెను ఎవరో ఒక కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కారులో ఉన్నప్పుడే ప్రియాంకకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తరువాత ప్రియాంకకు స్పృహ వచ్చినప్పుడు.. ఆమె ఒక గుర్తు తెలియని ప్రదేశంలోని ఒక ఇంటి  గదిలో ఉంది. గది బయటి నుంచి లాక్ చేసి ఉంది. అప్పుడు ప్రియాంకకు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. ఆపద నుంచి బయట పడింది. ఆమె ఎప్పుడూ తన డ్రెస్‌లోని ఒక ఇన్నర్ పాకెట్‌లో ఒక ఫోన్ పెట్టుకొని ఉంటుంది. ఆ ఫోన్ సహాయంతో ప్రియాంక తన తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపింది. ఆ తరువాత వారికి కాల్ చేసి జరిగిన ఘటన గురించి.. వివరించింది. ప్రియాంక తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో లొకేషన్ వద్దకు చేరుకొని.. ఆమెను విడిపించారు. 


కిడ్నాపర్లు ఎవరంటే?..

ప్రియాంకకు కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో సౌరభ్ అనే అబ్బాయి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఒక రోజు సౌరభ్ మరో ఇద్దరు అమ్మాయిలతో ప్రియాంక ఇంటికి వచ్చాడు. అక్కడ ప్రియాంక తల్లిదండ్రులను కూడా కలిశాడు. మరుసటి రోజు ప్రియాంక ఇంటి నుంచి బయలుదేరినప్పుడు.. సౌరభ్ ఒక తెల్ల కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశాడు. 


ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సౌరభ్‌, మరో ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసి కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-31T11:21:15+05:30 IST