పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడని ప్రియురాలి తండ్రిని చంపిన ప్రియుడు

ABN , First Publish Date - 2020-12-08T17:45:46+05:30 IST

ప్రియురాలితో తన పెళ్లి ప్రతిపాదనను ఆమె తండ్రి తిరస్కరించాడనే కోపంతో ప్రియుడు తండ్రిని హతమార్చిన దారుణ ఘటన ...

పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడని ప్రియురాలి తండ్రిని చంపిన ప్రియుడు

న్యూఢిల్లీ : ప్రియురాలితో తన పెళ్లి ప్రతిపాదనను ఆమె తండ్రి తిరస్కరించాడనే కోపంతో ప్రియుడు తండ్రిని హతమార్చిన దారుణ ఘటన ఢిల్లీలోని సోనియా విహార్ ప్రాంతంలో వెలుగుచూసింది. సోనియా విహార్ నివాసి సూరజ్ కుమార్ పాలం మెట్రో స్టేషనులో హౌస్ కీపరుగా పనిచేస్తున్నాడు. సూరజ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన బిజేందర్ సింగ్ కుమార్తెను ప్రేమించాడు. సూరజ్ కుమార్ కు తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేసేందుకు యువతి తండ్రి నిరాకరించాడు. దీంతో కోపంతో బిజేందర్ సింగ్ ఇంటికి వచ్చిన కూతురి ప్రియుడు సూరజ్ కుమార్ అతన్ని కత్తితో పొడిచి, ప్రెజర్ కుక్కర్ తో కొట్టి చంపాడు. అనంతరం నిందితుడు సూరజ్ పారిపోయాడు. పారిపోతున్న సూరజ్ కుమార్ ను ఢిల్లీలోని షా ఆడిటోరియం సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2020-12-08T17:45:46+05:30 IST