బంధువులబ్బాయితో ప్రేమలో పడిన యువతి.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రియుడితో కలిసి ఎంతపని చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-25T05:37:10+05:30 IST

ఆ యువతి తన బంధువులబ్బాయితో ప్రేమలో పడింది.. అతడిని తరచుగా కలుస్తుండేది.. విషయం తల్లికి తెలియడంతో మందలించింది.. అతడిని కలిసేందుకు వీల్లేదని కట్టడి చేసింది. అయినా ఆ యువతి అతడితో మాట్లాడుతూనే ఉంది...

బంధువులబ్బాయితో ప్రేమలో పడిన యువతి.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రియుడితో కలిసి ఎంతపని చేసిందంటే..

ఆ యువతి తన బంధువులబ్బాయితో ప్రేమలో పడింది.. అతడిని తరచుగా కలుస్తుండేది.. విషయం తల్లికి తెలియడంతో మందలించింది.. అతడిని కలిసేందుకు వీల్లేదని కట్టడి చేసింది. అయినా ఆ యువతి అతడితో మాట్లాడుతూనే ఉంది.. విషయం గమనించి తల్లి మరోసారి మందలించింది.. దీంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి ఆమెను కడతేర్చారు.. హత్యను యాక్సిడెంట్‌లా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.


వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని తుముకూరుకు చెందిన శైలజ అనే యువతి తన కజిన్(పెద నాన్న కుమారుడు) అయిన పునీత్‌ని ప్రేమించింది. అతడితో తరచుగా కలుస్తుండేది. ఈ ప్రేమ విషయం శైలజ తల్లి సావిత్రమ్మకు తెలిసింది. వరుసకు సోదరుడైన పునీత్‌తో ప్రేమ ఏమిటని శైలజని తల్లి సామిత్రమ్మ మందలించింది. ఇకపై పునీత్‌ను కలిసేందుకు వీల్లేదని.. ఫోన్‌లో కూడా మాట్లాడకూడదని హెచ్చరించింది. అయినా శైలజ పద్ధతి మార్చుకోలేదు. పునీత్‌తో గంటల కొద్దీ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. 


మరోసారి శైలజ వ్యవహారం గమనించిన సావిత్రమ్మ.. కూతురి వద్ద నుంచి ఫోన్ తీసేసుకుంది. దీంతో సావిత్రమ్మను తమ ప్రేమకు అడ్డుగా భావించి.. ఆమెను చంపేందుకు శైలజ, పునీత్ ఓ ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం జనవరి 31న ఆమెను హత్య చేశారు. అనంతరం దానిని ఓ యాక్సిడెంట్‌గా చిత్రీకరించి.. ఊరి చివర కాలువలో పడేశారు.


పోలీసులు కూడా మొదట్లో దానిని యాక్సిడెంట్‌గానే భావించారు. అయితే శైలజ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. సావిత్రమ్మ మరణం(పోస్టుమార్టం ప్రకారం) జరిగిన సమయంలో శైలజ ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశారు. శైలజ ఫోన్ లొకేషన్ కూడా అదే ప్రాంతంలో ఉండడంతో ఆమె గురించి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పునీత్‌తో ఆమె లవ్ ఎఫైర్ గురించి తెలిసింది. శైలజను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆమె నిజం అంగీకరించింది. పునీత్‌తో కలిసి తల్లిని చంపినట్లు నేరం ఒప్పుకొంది. 



Updated Date - 2022-02-25T05:37:10+05:30 IST