
వారిద్దరూ గతంలో ప్రేమికులు.. ఆ తర్వాత విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు.. ఆ అమ్మాయి మరో యువకుడితో ప్రేమలో పడింది.. అయితే అబ్బాయి మాత్రం అమ్మాయిని మర్చిపోలేక ఆమెపై పగ పెంచుకున్నాడు.. మాజీ ప్రేయసి పరువు తీసేందుకు ప్రయత్నించాడు.. ఆమె గురించి ఉన్నవీ లేనివీ ప్రచారం చేయడం ప్రారంభించాడు.. దీంతో ఆ యువతి తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాజీ లవర్‌ను హత్య చేసింది.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఓ యువతి.. నరేంద్ర అనే యువకుడితో గతంలో ప్రేమాయణం సాగించింది. కొన్ని రోజుల తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. నరేంద్ర నుంచి దూరమైన యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఆకాష్ అనే యువకుడికి దగ్గరైంది. ఆ విషయం తెలుసుకున్న నరేంద్ర తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మాజీ ప్రేయసి పరువు తీసేందుకు ప్రయత్నించాడు. ఆమె గురించి కాలనీ వాసులకు చెడ్డగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న యువతి తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి స్కెచ్ వేసింది.
ప్రేయసి కోరిక మేరకు నరేంద్రను ఆకాష్ హత్య చేశాడు. మృతదేహాన్ని అడవిలో 100 మీటర్ల లోతు గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. నరేంద్ర తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.