ఇంతలో ఆమె ఉంటున్న వీధిలోకి ఫుడ్ తీసుకుని ఏకంగా 42 మంది డెలివరీ బాయిస్ వచ్చారు. ఇంతమంది ఒకేసారి ఫుడ్ తీసుకుని వచ్చేసరికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతాన్ని అక్కడుంటున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. చూస్తుండగానే ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఆ ఫుడ్ యాప్‌లోని సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఆ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఒక డెలివరీ బాయ్‌కి చేరాల్సిన మెసేజ్ ఏకంగా 42 మందికి చేరింది. దీంతో వారంతా ఆహారం తీసుకుని ఆమె ఇంటికి తరలివచ్చారు.
జీఎంఏ రీజనల్ టీవీ సౌజన్యంతో...