Viral Video: ఒక యువతి డాన్స్ వేస్తోంటే మరో యువతి వీడియో తీస్తోంది.. ఆ తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు..!

ABN , First Publish Date - 2022-05-19T02:12:20+05:30 IST

ఇద్దరు యువతులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అది చూసు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆ

Viral Video: ఒక యువతి డాన్స్ వేస్తోంటే మరో యువతి వీడియో తీస్తోంది.. ఆ తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు..!

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు యువతులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అది చూసు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆ యువతులు ఏం చేశారనే వివరాల్లోకి వెళితే..


ఇంటర్నెట్, సోషల్ మీడియా.. ఈ రెండు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎలా ఫేమస్ అవుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఈ క్రమంలో కొందరు తమలో దాగి ఉన్న టాలెంట్‌ను బయటకు తీస్తూ..  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కోవకే చెందిన ఓ యువతి ఆరుబయటకు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఆ దృశ్యాలను వీడియో తీసుకుంటుంది. ఇదే సమయంలో భవనంపై ఉన్న మరోకరు ఆ ఇద్దరు యువతులకు తెలియకుండా వారి వీడియో తీస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని గమనించి.. అంతవరకూ చిందేసిన యువతి, సహా డ్యాన్స్‌ను రికార్డు చేసిన మరో యువతి సిగ్గుపడి నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోతారు. కాగా.. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు. 




Updated Date - 2022-05-19T02:12:20+05:30 IST