Virl Video: భర్తను చూసి సంతోషం పట్టలేకపోయింది.. పరుగెత్తి వెళ్లి అతని పైకి ఎగిరింది.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-09T14:51:29+05:30 IST

చిన్న నాటి స్నేహితులను లేదా బాగా ఇష్టమైన వారిని చాలా కాలం తర్వాత చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది.

Virl Video: భర్తను చూసి సంతోషం పట్టలేకపోయింది.. పరుగెత్తి వెళ్లి అతని పైకి ఎగిరింది.. చివరకు..

చిన్న నాటి స్నేహితులను లేదా బాగా ఇష్టమైన వారిని చాలా కాలం తర్వాత చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. వారిని చూడగానే ఆప్యాయంగా హత్తుకోవడం లేదా గట్టిగా అరవడం వంటి పనులు చేస్తుంటాం. అయితే చాలా కాలం తర్వాత విదేశం నుంచి వస్తున్న భర్తను చూసిన యువతి సంతోషం పట్టలేకపోయింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న భర్తను చూసి తీవ్ర ఉత్సాహానికి గురైంది. 



పరిగెత్తుకుంటూ వెళ్లి అతని పైకి దూకింది. అయితే అనుకోకుండా భర్త స్లిప్‌ అయి కిందపడిపోవడంతో వేగంగా పరిగెత్తిన ఆమె భర్తని ఢీకొట్టి పడిపోయింది. వెంటనే వారంతట వారే లేచి హగ్ చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (viral video) అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-09T14:51:29+05:30 IST