వీడియో కాల్ చేస్తే నగ్నంగా కూర్చున్న యువతి.. షాకైన యువకుడు.. కట్ చేస్తే..

ABN , First Publish Date - 2022-02-28T23:01:08+05:30 IST

అతడికి ఆమె డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది.. ఆ పరిచయం కొద్ది క్షణాల్లోనే స్నేహంగా మారింది..

వీడియో కాల్ చేస్తే నగ్నంగా కూర్చున్న యువతి.. షాకైన యువకుడు.. కట్ చేస్తే..

అతడికి ఆమె డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది.. ఆ పరిచయం కొద్ది క్షణాల్లోనే స్నేహంగా మారింది.. ఇద్దరూ మొబైల్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు.. యువతి అభ్యర్థన మేరకు అదే రోజు ఆ యువకుడు ఆమెకు వీడియో కాల్ చేశాడు.. ఆ సమయంలో యువతి నగ్నంగా సోఫాలో కూర్చుని ఉంది.. అలాగే ఆ యువకుడితో మాట్లాడింది.. షాకైన యువకుడు కాల్ కట్ చేశాడు.. తర్వాత అతడికి టార్చర్ మొదలైంది. 


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన బాధిత యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఖుషీ అనే యువతి ఈ నెల 24 పరిచయమైంది. ఇద్దరూ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. అనంతరం వీడియో కాల్ చేసుకోవాలనుకున్నారు. బాధిత యువకుడు ఆమెకు వీడియో కాల్ చేశాడు. ఆ సమయంలో ఖుషీ సోఫాలో నగ్నంగా కూర్చుని ఉంది. ఆ యువకుడితో మాట్లాడిన వీడియో మొత్తాన్ని రికార్డ్ చేసింది. షాకైన యువకుడు కాల్ కట్ చేశాడు. అప్పుడు ఆమె తన అసలు రూపం బయటపెట్టింది. 


ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడతానని చెప్పి ఆ యువకుడిని బెదిరించడం ప్రారంభించింది. ఆ వీడియో నెట్‌లో పెట్టకూడదంటే తనకు రూ.50 వేల కావాలని అడిగింది. అతడు పేటీఎమ్ ద్వారా డబ్బులు పంపించాడు. ఆ రాత్రి అంతా ఆ యువకుడికి వరుసగా ఫోన్లు చేసి మొత్తం రూ.1.80 లక్షలు కాజేసింది. తర్వాతి రోజు ఫోన్ చేసి మరో రూ.50 వేలు కావాలని అడిగింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Updated Date - 2022-02-28T23:01:08+05:30 IST