
ఆమె వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఢిల్లీ నుంచి ప్రయోగ్‌రాజ్‌కు వెళ్లింది.. ఆ విషయం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు.. ఆమె కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్లు కంగారుపడుతున్నారు.. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లో ఆమె మృతదేహం బయటపడింది.. ఆమె చేతి మీద `రవి` అని టాటూ ఉంది.. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీకి చెందిన యువతి షాలిని ఈ నెల 13న ప్రయాగ్‌రాజ్‌కు ట్రైన్లో వెళ్లింది. ఆ తర్వాత ఎవరిని కలిసిందో, ఏం జరిగిందో తెలియదు కానీ, తాజాగా ఆమె మృతదేహం బయటపడింది. ఆమె చేతి మీద `రవి` అని టాటూ ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌ను పరిశీలించగా రవి అనే పేరుతో ఆమెకు ఏడుగురు స్నేహితులు ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం వారందరినీ విచారిస్తున్నారు.