వాట్సప్‌ స్టేటస్‌లో ప్రియురాలి నగ్న వీడియో!

ABN , First Publish Date - 2022-01-15T08:13:23+05:30 IST

బాలికను ప్రేమ పేరుతో నమ్మించి.. ఆమె నగ్న వీడియోను చిత్రీకరించిన యువకుడు, దాన్ని తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు.

వాట్సప్‌ స్టేటస్‌లో ప్రియురాలి నగ్న వీడియో!

  • తాను పిలిస్తే రాలేదన్న కోపంతో యువకుడి నిర్వాకం
  • ప్రియుడి ఇంటి ముందు బాలిక ఆందోళన
  • నిందితుడిపై అట్రాసిటీ, పోక్సో కేసు.. 


హుజూర్‌నగర్‌, జనవరి 14: బాలికను ప్రేమ పేరుతో నమ్మించి.. ఆమె నగ్న వీడియోను చిత్రీకరించిన యువకుడు, దాన్ని తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని శ్రీనివాసపురంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దళిత బాలిక ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జింకల సైదులు కుమారుడు మహేశ్‌, కోదాడలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహేశ్‌, నాలుగు నెలల క్రితం బాలికకు వీడియో కాల్‌ చేసి నగ్నంగా కనిపించాలని కోరటంతో ఆమె అలాగే చేసింది. ఆ వీడియో కాల్‌ను మహేశ్‌ సేవ్‌ చేసి పెట్టుకున్నాడు. ఇటీవల బాలికను స్కూటీ నడపవద్దని; తాను చెప్పినప్పుడు తనవద్దకు రావాలని..  లేదంటే వీడియోను బయట పెడతానని పదేపదే హెచ్చరిస్తున్నాడు. ఇందుకు ఆమె.. తాను రాలేనని, పొలం పనులు ఉన్నాయని చెబుతూ వస్తోంది. ఈ విషయమై బాలికతో మహేశ్‌ ఐదు రోజుల క్రితం ఘర్షణ పడ్డాడు. ఈ నెల 10న 19 సెకన్ల నిడివి గల బాలిక నగ్న వీడియోను తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. 


బాలికకు ఆమెతో పరిచయం ఉన్నవాళ్లు ఆ వీడియో గురించి చెప్పడంతో ఆందోళన చెంది, తల్లిదండ్రులకు విషయమంతా చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ అదే రోజు బాలిక, తన తల్లిదండ్రులతో కలిసి మహేశ్‌ ఇంటికి ముందు ఆందోళనకు దిగింది. అనంతరం మహేశ్‌ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మహేశ్‌ కూడా పరారీలో ఉన్నాడు. దిక్కుతోచని స్థితిలో మరుసటి రోజు బాధిత బాలిక, ఆమె కుటుంబసభ్యులు ఘటనపై హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. మహేశ్‌పై పోలీసులు అట్రాసిటీ, అత్యాచారం, ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు. రెండు రోజులుగా గ్రామంలోని పెద్దమనుషులు బాలికకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. బాలికను పెళ్లి చేసుకునేందుకు మహేశ్‌ నిరాకరిస్తున్నాడు. కాగా యువకుడి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న బాలిక వద్దకు కోదాడ డీఎస్పీ రఘు వెళ్లి వివరాలు సేకరించారు. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మహేశ్‌ నమ్మించి రెండేళ్లుగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాలిక తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకూ మహేశ్‌ ఇంటి ముందు నుంచి కదలబోనని స్పష్టం చేసింది.   

Updated Date - 2022-01-15T08:13:23+05:30 IST