అమ్మాయిలదే హవా..

ABN , First Publish Date - 2022-06-29T07:02:34+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. రాష్ట్ర స్థాయిలో 68శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో నే జగిత్యాల జిల్లా పదవ స్థానంలో నిలిచినట్లు ఇంటర్మీడియేట్‌ నోడల్‌ అధి కారి నారాయణ తెలిపారు.

అమ్మాయిలదే హవా..

ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో పదో స్థానంలో జగిత్యాల 

జిల్లా ఉత్తీర్ణత 68శాతం

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 28:  ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. రాష్ట్ర స్థాయిలో 68శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో నే జగిత్యాల జిల్లా పదవ స్థానంలో నిలిచినట్లు ఇంటర్మీడియేట్‌ నోడల్‌ అధి కారి నారాయణ తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 7,563 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా, 4666 మంది విద్యార్థులు అర్హత ఉత్తీర్ణులయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 7617 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయగా, 5207మంది ఉత్తీర్ణుల య్యార య్యార న్నారు. గతంలో కన్నా ఈ యేడాది మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఆయన తెలిపారు. 

మరోసారి అల్ఫోర్స్‌ ప్రభంజనం- నరేందర్‌రెడ్డి 

 మంగళవారం విడుదలైన ఇంటర్మీడియేట్‌ పరీక్ష ఫలితాల్లో జగిత్యాల జిల్లాలో అల్పోర్స్‌ జూనియర్‌ కళాశాల విద్యార్ధులు ప్రభంజనం సృష్టిం చా రని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ నరేందర్‌రెడ్డి అన్నారు. కళా శా లకు చెందిన విద్యార్థులు ఎంపీసీ విభాగంలో తుమ్మనపల్లి స్ఫూర్తి 467/ 470, గిరి వినతీ 467/470, చందోళి శ్రీముఖి 467/470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారన్నారు. బైపిసీ ఫస్టియర్‌లో రాగిడి వైష్ణవి 433/440, సీఈసీలో స్రవంతి 476/500 మార్కులు సాదించగా, సె కండియర్‌ ఎంపీసీ విభాగంలో దుంపెట శ్రీవల్లి 987/1000, బైపీసీ విభా గంలో 966/1000, సీఈసీ విభాగంలో 933/1000 మార్కులు సాధించిన ట్లు నరేంధర్‌ రెడ్డి తెలిపారు. 

నవ్య బాలికల కళాశాల హవా...

ఇంటర్మీడియేట్‌ 2022 ఫలితాల్లో నవ్య బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు తమ హవా కొనసాగించారు. జిల్లాలో ఏకైక ప్రైవేట్‌ బాలికల కళాశాల నుంచి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించినట్లు కళాశాల కర స్పాండెంట్‌ శ్రీపాద నరేష్‌ తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఏనుగు రక్షిత 990/1000 మార్కులతో రాష్ట్ర స్ధాయిలో మూడో ర్యాంకు సాధించిందన్నారు. ఎస్‌ శ్యామల 976, కృష్ణహిత 960, ఎం ఈసీ విభాగంలో వైష్ణవి 960, బైపీసీ విభాగంలో అంజలి 931, సీఈసీ విభాగంలో సుధీన 922 మార్కులు సాధించగా, ఫస్టియర్‌లో బైపీసీ విభా గంలో హర్షిత 436 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండవ స్ధానంలో నిలిచిం దన్నారు. ఎంపీసీలో అశ్విత 464 రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించగా, సీ ఈసీ విభాగంలో హరిణి 480 మార్కులతో జిల్లాలో మొదటి ర్యాంకు సా ధించిందన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ప్రిన్సిపాల్‌  గాలిపెల్లి ఈశ్వర్‌, అధ్యాపకులు, విద్యార్థినులున్నారు. 


శ్రీవాణి విజయఢంకా...

రాష్ట్ర స్థాయిలో విడుదలైన ఇంటర్మీడియేట్‌ ఫలితాల్లో శ్రీవాణి జూని యర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు విజయఢంకా మ్రోగించారని కళా శాల ప్రిన్సిపాల్‌ సిరిసిల్ల రాజేంధర్‌ శర్మ తెలిపారు. ఫస్ట్‌ఇయర్‌ ఎంపీసీ విభాగంలో నేహ 465, స్టేట్‌ 3వ ర్యాంకు, చందన 464, స్టేట్‌ 4వ ర్యాంకు, సుప్రియ 463తో స్టేట్‌ 5వ ర్యాంకు సాధించారన్నారు. సీఈసీ విభాగంలో శ్రీజ 480, సౌమ్య 479, సాత్విక 478 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను భారతీయ నాగరిక విద్యాసమి తి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్‌రావు, తెలుగు భాషా సంరక్షణ సంఘ అధ్యక్షుడు ఎంవీ నర్సింహారెడ్డితో పాటు, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు అభినందించారు. 

శ్రీ చైతన్య కళాశాల..

ఇంటర్మీడియేట్‌ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయదుంధుభి మోగించారు. ఫస్టియర్‌ ఎంపీసీ లో సంగ విజ్ఞత 467, కట్లకుంట్ల శ్రీనిక 467, గట్ల ప్రియాంక 467, సిరిపురం అపరాజిత 467, మరిపెల్లి నాగమల్లిక 467 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్ధానం లో నిలిచారని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మెన్‌ ముసిపట్ల రాజేంధర్‌ తెలి పారు. సీఈసీ విభాగంలో అల్లకొండ సుకన్య 494, రాష్ట్ర ప్రధమ ర్యాం కు, బైపీసీ విభాగంలో రాచర్ల వైష్ణవి 435 రాష్ట్ర మూడవ ర్యాంకు ఎంఈసీ విభాగంలో చంద్రపాకల కారుణ్య సెలియా 488 మార్కులతో రాష్ట్ర స్థా యిలో 8వ ర్యాంకు, సెకండియర్‌ ఎంపీసీ విభాగంలో  రౌతు శ్రీయ 986, బైపీసీ విభాగంలో తుమ్మ అక్షిత 986, సీఈసీలో ఆకుతోట అభినయ 929, ఎంఈసీ విభాగంలో చల్ల సాహితీ 957 మార్కులు సాధించారన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, అందు కు సహకరించిన అధ్యాపకబృందానికి రాజేంధర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 



Updated Date - 2022-06-29T07:02:34+05:30 IST