ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , First Publish Date - 2022-06-29T04:07:34+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రకటించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరంలో జిల్లా 11వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 8వ స్థానంలో నిలిచింది. జనరల్‌ విభాగంలో మొదటి సంవత్సరం 3064 మంది బాలురు పరీక్ష రాయగా 1277 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3565 మంది పరీక్షకు హాజరు కాగా 2269 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

 ఏసీసీ, జూన్‌ 28: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రకటించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు.  రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరంలో జిల్లా 11వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 8వ స్థానంలో నిలిచింది.

జనరల్‌ విభాగంలో మొదటి సంవత్సరం 3064 మంది బాలురు పరీక్ష రాయగా 1277 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3565 మంది పరీక్షకు హాజరు కాగా 2269 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరంలో 727 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 323 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 558 పరీక్షకు హాజరు కాగా 418 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ప్రథమ సంవత్సరం బాలుర ఉత్తీర్ణత శాతం 42 శాతం, బాలికల ఉత్తీర్ణత శాతం 65 శాతంగా ఉంది. 

ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 3012 మంది బాలురు పరీక్ష రాయగా 1679 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 3517 మంది పరీక్ష రాయగా 2509 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో ద్వితీయ సంవత్సరంలో 736 మంది బాలురు పరీక్ష రాయగా 404 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 536 మంది పరీక్ష రాయగా 408 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 55 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 71 శాతం నమోదైంది. 

మొదటి సంవత్సరంలో జనరల్‌, ఒకేషనల్‌లో బాలురు, బాలికలు  మొత్తం 7914 మంది పరీక్షలు రాయగా 4287 మంది ఉత్తీర్ణత సాధిం చారు. ఉత్తీర్ణులైన వారి శాతం 54 శాతంగా ఉంది.  ద్వితీయ సంవత్సరం లో జనరల్‌, ఒకేషనల్‌లో బాలురు, బాలికలు మొత్తం 7801 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయగా 5 వేల మంది ఉత్తీర్ణత సధించారు. 64 శాతం నమోదైంది.  

Updated Date - 2022-06-29T04:07:34+05:30 IST