ఎస్సెస్సీ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , First Publish Date - 2022-07-01T04:52:07+05:30 IST

పదో తరగతి ఫలితాల్లో బాలి కలదే పైచేయిగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం విడుదలైన ఎస్సెస్సీ పరీక్షా ఫలితాలలో 90.55 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా రాష్ట్రస్థాయిలో 23వ స్థానం దక్కించుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెం దిన పదో తరగతి విద్యార్థులు 10,522 మంది పరీక్షలకు హాజరుకాగా 9528 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఎస్సెస్సీ ఫలితాల్లో బాలికలదే పైచేయి

జిల్లాలో 90.55 శాతం ఉత్తీర్ణత నమోదు

రాష్ట్ర స్థాయిలో 23వ స్థానంలో జిల్లా

మంచిర్యాల, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో బాలి కలదే పైచేయిగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం విడుదలైన ఎస్సెస్సీ పరీక్షా ఫలితాలలో 90.55 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా రాష్ట్రస్థాయిలో 23వ స్థానం దక్కించుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెం దిన పదో తరగతి విద్యార్థులు 10,522 మంది పరీక్షలకు హాజరుకాగా 9528 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం విద్యార్థుల్లో బాలురు 5449 మంది పరీక్షలకు హాజరుకాగా 4819 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 88.44 నమోదైంది. అలాగే 5073 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 4709 ఉత్తీర్ణులు కాగా 92.82 శాతం బాలికల ఉత్తీర్ణత శాతం నమోదైంది. పదో తరగతి ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలల హవా కొనసాగింది. అధిక శాతం ప్రైవే టు స్కూళ్లలో 10/10 జీపీఏ నమోదు కావడం గమనార్హం. జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న ప్రభుత్వ పాఠ శాలలు 168 ఉండగా మొత్తం 7223 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6196 మంది ఉత్తీర్ణత సాధించగా, 1027 మంది ఫెయిలయ్యారు. ప్రభుత్వ పాఠశా ల ల్లో ఉత్తీర్ణత 86.0శాతం నమోదైంది. వీటిలో నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 22 ఉండగా, 10జీపీఏ వచ్చిన పాఠశాలలు 42 ఉన్నాయి. 

పదిలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు 

ఏసీసీ: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి. తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 99 శాతం, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 99 శాతం, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠ శాలల్లో 98 శాతం, మోడల్‌ స్కూల్‌లలో 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద ప్రభుత్వ ఆధ్వర్యంలో 168 పాఠశాలల్లో 7223 మంది పరీక్షలు రాయగా 6196 మంది విద్యార్థులు ఉత్తీ ర్ణులయ్యారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 86 శాతంగా నమోదైంది. మంచిర్యాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కు చెందిన 79 మంది  పరీక్షలు రాయగా 78 మంది ఉత్తీర్ణులయ్యారు. పది మంది విద్యార్థులకు 10 జీపీఏ, ఐదుగురు విద్యార్థులకు 9.8 జీపీఏ, ఇద్దరు విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు.  

Updated Date - 2022-07-01T04:52:07+05:30 IST