పదోతరగతి ఫలితాల్లో బాలికల హవా

ABN , First Publish Date - 2022-07-01T06:40:14+05:30 IST

పదోతరగతి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. కొవిడ్‌ సమయంలో 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో వంద శాతం ఉత్తీర్ణతను ప్రకటించారు. రెండు సంవత్సరాల తరువాత పది పరీక్షలు నిర్వహించారు. 2018-19లో 97.7 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుతం 1.94 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఈ సారి 95.76 శాతం జిల్లాలో ఉత్తీర్ణత సాధించారు

పదోతరగతి ఫలితాల్లో బాలికల హవా

- రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాకు ఏడో స్థానం

- జిల్లాలో 95.76 శాతం ఉత్తీర్ణత

- 2018-19 కంటే 1.94 శాతం తగ్గుదల

-  6,343 మంది విద్యార్థులకు 6074 మంది ఉత్తీర్ణులు 

- బాలికల ఉత్తీర్ణత 97.43 శాతం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పదోతరగతి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది.   కొవిడ్‌ సమయంలో 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో వంద శాతం ఉత్తీర్ణతను ప్రకటించారు. రెండు సంవత్సరాల తరువాత పది పరీక్షలు నిర్వహించారు. 2018-19లో 97.7 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుతం 1.94 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఈ సారి 95.76 శాతం జిల్లాలో ఉత్తీర్ణత సాధించారు. గత ఫలితాల మాదిరిగానే ఈసారి కూడా బాలికలదే పై చేయిగా నిలిచింది. ఈసారి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 95.76 శాతం ఉత్తీర్ణతతో జిల్లా ఏడో స్థానంలో నిలిచింది. 6,343 మంది విద్యార్థులు పరీక్షలకు  హాజరయ్యారు. ఇందులో బాలురు 2,997 మంది, బాలికలు 3346 మంది ఉన్నారు. ఫలితాల్లో 6074 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 2814 మంది, బాలికలు 3260 మంది ఉన్నారు. బాలురుల్లో 93.89 శాతం, బాలికల్లో 97.43 శాతం ఉత్తీర్ణత ఉంది. బాలికల్లో అత్యఽధికంగా 446 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాఽధించిన విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సారి 40 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. 37 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 

269 మంది ఫెయిల్‌

జిల్లాలో ఈ సంవత్సరం పది ఫలితాల్లో 269 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 2997 మంది బాలురు పరీక్షలకు హజరు కాగా 183 మంది ఫెయిల్‌ అయ్యారు. 3346 మంది బాలికలు పరీక్షలకు హజరు కాగా 86 మంది మాత్రమే ఫెయిల్‌ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. 

 ఉత్తమ ఫలితాలు సాధించాం

- రాధాకిషన్‌, డీఈవో 

జిల్లాలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో ఈ సంవత్సరం 95.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచాం. ప్రభుత్వ పాఠశాలల్లో పలువురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. అందరి ప్రోత్సాహంతో ఉత్తమ ఫలితాలు సాధించాం. ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఫీజు చెల్లించడానికి జూలై 18 చివరి గడువు. 50 రూపాయల అపరాధ రుసుముతో రెండు రోజుల ముందు వరకు చెల్లించుకోవచ్చు. రీకౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. జూలై 15వ తేదీ వరకు నేరుగా అప్లికేషన్లు పంపించుకోవాలి. వెరిఫికేషన్‌ కోసం ఒక్కో  సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలి.



Updated Date - 2022-07-01T06:40:14+05:30 IST