వట్‌పల్లికి చేరిన గీతార్చన ప్రచారయాత్ర

Nov 27 2021 @ 22:51PM
ప్రచారయాత్రకు స్వాగతం పలుకుతున్న స్థానికులు

వట్‌పల్లి, నవంబరు 27 : డిసెంబరు 14న హైదరాబాద్‌లో నిర్వహించే లక్ష యువ గీతార్చన ప్రచారయాత్ర జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ మీదుగా శనివారం వట్‌పల్లికి చేరుకున్నది. భజరంగ్‌దళ్‌ వట్‌పల్లి మండల శాఖ, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక సర్వేశ్వరపురి పీఠాధిపతి అంబికా శివయాగి మాట్లాడుతూ లక్ష యువగళ గీతార్చనకు హిందూ బంధువులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా అఖండ కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి ద్వారక రవి, కోశాధికారి రాములు, భజరంగ్‌ దళ్‌ మండలాధ్యక్షుడు అరవింద్‌, మాజీ మండలాధ్యక్షుడు రాజు, లక్ష్మణ్‌, పాండు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.