రక్షాబంధన్ వేళ ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వండి!

ABN , First Publish Date - 2022-08-07T01:32:13+05:30 IST

రాఖీ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. తోబుట్టువులకు ఒకరిపై మరొకరికి

రక్షాబంధన్ వేళ ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వండి!

రాఖీ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. తోబుట్టువులకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ వేడుక చేసుకుంటారు. అయితే, ఈ రక్షాబంధన్ వేళ మన బంధాన్ని మరింత ఆరోగ్యకరంగా, మరింత ఆనందంగా జరుపుకునే వీలు కూడా మన చేతిలోనే ఉంది. రక్షాబంధన్ వేళ మనల్ని అభిమానించేవారి ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఓ బాక్స్ నిండా బాదాములను ఇవ్వడం ద్వారా వారిపై మనకున్న ప్రేమను వ్యక్తీకరించొచ్చు. 


బాదాముల్లో అత్యంత కీలక పోషకాలైన ప్రొటీన్‌ (6 గ్రాములు), ఫైబర్‌ (4 గ్రాములు), ఫ్యాట్స్‌ (9.5 గ్రాములు), విటమిన్‌-ఇ (7.7 మిల్లీ గ్రాములు), కాల్షియం (81 ఎంజీ), మెగ్నీషియం(81 ఎంజీ), ఇతర పోషకాలు ప్రతి 30 గ్రాముల బాదములతో లభిస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం.. మధుమేహ నియంత్రణలో బాదములు అద్భుతంగా తోడ్పడతాయి. బరువు నియంత్రణ, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు తగిన పరిష్కారాలను అందించే శక్తి బాదాములకు ఉంది. వీటిని విభిన్న మార్గాల్లో తీసుకోవచ్చు. అవి నేరుగా, రోస్ట్‌ చేసి, ఇతర రుచులను జోడించి, ఏదైనా రెసిపీలో  ఇంగ్రీడియెంట్‌గా కూడా జోడించి తీసుకోవచ్చు. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఈ రక్షా బంధన్‌ వేళ బహుమతిగా అందించడానికి మంచి అవకాశంగా భావించొచ్చు. 


న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. ఈ పండుగ సీజన్‌లో మీరు అందించే బహుమతులను గురించి పునరాలోచించడంతో పాటుగా పరిశీలించాలని తాను కోరుకుంటున్నానన్నారు. స్వీట్లు, ఫ్రై చేసిన పదార్థాలకు బదులుగా బాదములను తోబుట్టవులకు అందించి వారి ఆరోగ్యాన్ని కాంక్షించాలని సూచించారు. ఇవి ఆలోచనాత్మక బహుమతిగా నిలుస్తాయన్నారు. దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయని పేర్కొన్నారు. బాదాములలో  అధిక మొత్తంలో బీ2 /రిబోఫ్లావిన్‌ ఉంటుందని వివరించారు. కాబట్టి శక్తివంతమైన స్నాక్‌గా బాదములను తీసుకోవచ్చని షీలా కృష్ణస్వామి వివరించారు.

Updated Date - 2022-08-07T01:32:13+05:30 IST