అవయవదానంతో పునర్జన్మను ప్రసాదించండి

ABN , First Publish Date - 2022-05-29T06:22:57+05:30 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవదానం చేసి పునర్జన్మ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని న్యాయమూర్తి వాసుదేవరావు పిలుపునిచ్చారు.

అవయవదానంతో పునర్జన్మను ప్రసాదించండి
ప్రసంగిస్తున్న న్యాయమూర్తి వాసుదేవరావు

పుంగనూరు రూరల్‌, మే 28:  ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవదానం చేసి పునర్జన్మ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని న్యాయమూర్తి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ కొంతమంది ఆనారోగ్యంతో, ప్రమాదాల బారిన పడి బ్రెయన్‌డెడ్‌ అయిన వారు అవయవదానం చేయడం వల్ల మరో వ్యక్తి ప్రాణం నిలపడానికి అవకాశం ఉందన్నారు. అలాంటి వారి నుంచి కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర అవయవాలను ఇతరులకు ఇవ్వడం వల్ల పునర్జన్మ లభిస్తుందని తెలిపారు. కానీ వీటిపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని కోరారు. వైద్యాధికారి మమతారాణి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, వీరమోహన్‌రెడ్డి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:22:57+05:30 IST